Redmi Note 12 Pro: రెడ్ మీ 12 ప్రో 200 మెగాపిక్సెల్ కెమెరా.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Redmi Note 12 Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండి తాజాగా రెడ్ మీ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 07:36 PM IST

Redmi Note 12 Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండి తాజాగా రెడ్ మీ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను లాంచ్ చేయనంది. కాగా అక్టోబర్ 27న చైనీస్ మార్కెట్ లో ఈ సీరియస్ ను విడుదల చేయనుంది. రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో,రెడ్‌ మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ లను విడుదల చేయనుంది షావోమి.
వీటిలో రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫ్లాగ్‌ షిప్‌ స్పెసిఫికేషన్ లతో విడుదల అయ్యింది. అయితే రెడ్ మీ నోట్ 12 సిరీస్ భారత్‌ తో పాటుగా మరిన్ని దేశాలకు కూడా త్వరలో రానున్నాయట. ఈ రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ వెనుక 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ వెనుక భాగంలో మొత్తంగా మూడు కెమెరాలు ఉంటాయి. మరోవైపు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 210వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని తెలుస్తోంది.
 రెడ్ మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లభించనుంది. ఈ రెడ్‌మీ నోట్ 12 ప్రో, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. కాగా రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ను ఇండియా లో కూడా లాంచ్ కానుంది. ఇక రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్ లు కూడా భారత మార్కెట్ కు రానున్నాయి. కాగా ఆ స్మార్ట్ ఫోన్ లు స్పెసిఫికేషన్ లు, పేర్లతో వస్తాయా లేదంటే షావోమీ సంస్థ ఇంకా ఏమైనా మార్పులు చేస్తుందా అనేది చూడాలి మరి. ఈ విషయంపై రెడ్ మీ ఇంకా పూర్తి సమాచారాన్ని ఇంకా ప్రకటించలేదు.