Redmi 12: అతి తక్కువ ధరకే రెడ్ మీ సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 07:30 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోని తాజాగా మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ 12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను యూకేలో లాంచ్‌ చేయగా త్వరలోనే భారత్ మార్కెట్ లోకి కూడా రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే..

ఇందులో మీడియా టెక్ జీ88 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండ నుంది. ఇకపోతే ధర విషయానికొస్తే.. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 17,000 లుగా ఉండనుంది. ఇక ఇందులో 6.79 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వర్చువల్ రామ్ 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రైమవరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

సింగిల్ చార్జింగ్ తో 37 గంటల పాటు టాక్ టైమ్ బ్యాకప్ కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో 4జీ, వై-ఫై, బ్లూ టూత్ 5.3, గ్లోనాస్, గాలిలియో, బైదూ, ఎన్ఎఫ్సీ, ఎఫ్ ఎం రేడియో, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, జీపీఎస్ ఆప్షన్స్‌ ని కూడా అందించారు. యూకే లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ని వీలైనంత తొందరలో భారత మార్కెట్లోకి కూడా తీసుకురానున్నారు.