Realme: రియల్ మీ జీటీ నియో 3టీ.. తక్కువ ధర.. అద్భుతమైన ఆఫర్లతో?

రియల్ మీ జీటీ నియో 3టీ నేడు భారత మార్కెట్ లోకి విడుదల అయ్యింది. నేడు ఈ స్మార్ట్ ఫోన్ గ్రాండ్ గా లాంచ్ చేశారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 09:02 PM IST

రియల్ మీ జీటీ నియో 3టీ నేడు భారత మార్కెట్ లోకి విడుదల అయ్యింది. నేడు ఈ స్మార్ట్ ఫోన్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. నేడు అనగా సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భారత్లో లాంచ్ అయ్యింది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ రియల్ మీ వెబ్సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. కాగా ఈ లిస్టింగ్ పేజ్ ద్వారా ఇప్పటికే చాలా వరకు ఇందుకు సంబంధించిన స్పెసిఫికేషన్ లు బయటికి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, అలాగే 80 వాట్ పాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

అయితే ఫస్ట్ సేల్ ఈ మొబైల్ ఫోన్ పై ఏడు వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు అని రియల్ మీ ఆఫర్ లను వెల్లడించింది. కానీ సేల్ డేట్ ఎప్పుడు అన్నది ఇంకా వెల్లడించలేదు. కదా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఈ ఫోను తొలిసారి సేల్ కు రావచ్చు అని అంచనా. అలాగే బ్యాంకు కార్డు ఆఫర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు కలిపి రియల్ మీ నియో జిటీ నియో 3టీ పై 7000 రూపాయల వరకు తగ్గింపు ఉంది అవకాశం. కాగా ఈ రియల్ మీ నియో జిటి న్యూ 3టీ ప్రారంభ ధర గ్లోబల్ గా 469.99 డాలర్లు.

అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 37,500. కానీ ఇండియాలో ఇంతకంటే తక్కువ ధరకే లంచ్ అయినట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్‌ రానుండగా.. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వేపర్ కూలింగ్ చాంబర్, వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ సపోర్ట్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంటుంది. రియల్ మీ జీటీ నియో 3టీ వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ ప్రధాన, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలతో ఈ ఫోన్‌ వస్తోంది. బ్యాక్ ప్యానెల్ డిజైన్ డిఫరెంట్‌గా మ్యాట్ ఫినిష్‌తో ఉంటుంది.