Site icon HashtagU Telugu

Phone Charging : ఏంటి మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా డౌన్ అవుతోందా? అయితే ఇలా చేస్తే ఛార్జింగ్ డౌన్ కాదు !!

Phone Charging

Phone Charging

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే చాలామంది ఫోన్ ఛార్జ్ (Phone Charging)త్వరగా డౌన్ అవుతుంది. ముఖ్యంగా డే టు డే యూజ్‌కి మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టడం ఓ సమస్యగా మారింది. అయితే టెక్నాలజీ నిపుణుల సూచనల ప్రకారం కొన్ని చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు.

మొదటిగా ఫోన్‌ స్క్రీన్ బ్రైట్నెస్‌ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాటరీ త్వరగా డౌన్ అవుతుంది. అందువల్ల స్క్రీన్ బ్రైట్నెస్‌ను మాన్యువల్‌గా తక్కువ స్థాయిలో పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం తర్వాత ‘నైట్ మోడ్’ లేదా ‘డార్క్ మోడ్’ ఆన్ చేస్తే స్క్రీన్‌లో వెలుతురు తక్కువగా ఉండి బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇది కళ్లకి కూడా మంచిదే.

Shubhanshu Shukla : కాసేపట్లో భూమిపైకి శుభాంశు శుక్లా

ఫోన్ వాడని సమయంలో స్క్రీన్ లాక్ పెట్టడం, అనవసరంగా ఓపెన్‌గా ఉంచకుండా ఉండటం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం నిలుస్తుంది. అదే విధంగా ‘బ్యాటరీ సేవర్’ అనే ఫీచర్‌ను ఆన్ చేస్తే, ఫోన్‌లో Unnecessary Processes ఆగిపోతాయి. దీంతో బ్యాటరీని ఎక్కువ సమయం పాటు ఉపయోగించుకోవచ్చు.

ఇంకా బ్యాటరీ ఎక్కువగా వినియోగించే యాప్స్‌ను గుర్తించి వాటి బ్యాగ్రౌండ్ రిఫ్రెష్‌ ఆపేయాలి. అనవసరమైన డాటా వినియోగాన్ని తగ్గించేందుకు బ్యాగ్రౌండ్ డాటాను రిస్ట్రిక్ట్ చేయాలి. ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు పాటు ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ పాటించటం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.