ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఏదైనా కొనాలి అంటే జేబు(pocket) లోనో, హ్యాండ్ బ్యాగ్(handbag) లోనో డబ్బులు చూసుకొని కాలు బయట పెట్టేవాళ్ళం. తరువాత ఏటీఎం(atm )కార్డు వచ్చింది చేతిలో డబ్బులు లేకపోయినా పిన్ నెంబర్ గుర్తు ఉంటే చాలు పేమెంట్స్ చేసేసేవాళ్ళం. ఇక ఇప్పుడు అన్ని యూపీఐ (UPI) పేమెంట్స్. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఫోన్ పే(phone pe), గూగుల్ పే(Google pay), పేటియం (Paytm), అమెజాన్ పే(Amazon pay).. ఇలా ఎక్కడా క్యాష్ (Cash )తీసే పనే లేదు.
ఇప్పుడు అది కూడా దాటి మరో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోతుంది. ఇకపై షాపుకెళితే చక్కగా చేతులు ఊపుకుంటూ షికారుకి వెళ్లినట్టు వెళ్లిపోవచ్చు. ఎందుకంటే అమెజాన్ ఒక కొత్త టెక్నాలజీ తెచ్చింది. ఎలా అయితే మన ప్రభుత్వాలు ఆధార్ కార్డు ఆధారంగా, మన చేతి వేలిముద్రలతో సంక్షేమ పథకాలు అందచేస్తున్నాయో అలాగే బయోమెట్రిక్ టెక్నాలజీతో అరచేతితో పేమెంట్స్(Palm Reading Payment Technology) చేసేయొచ్చు.
గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ వన్ పామ్ పేమెంట్ (Amazon One’s Palm Payment)తో చెల్లింపులు సులువుగా చేసేయొచ్చు. షాపుల్లో మనక్కావాల్సింది మనం కొనుక్కున్నాక.. పేమెంట్స్ సెక్షన్ దగ్గర ఉన్న డివైజ్ మీద అరచేయి స్కాన్ చేస్తే చాలు పేమెంట్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అయితే అలా జరగాలి అంటే ముందుగా మనం మన అరచేయి ని స్కాన్ చేసి, దాన్ని మన కార్డుతో లింక్ చేయాలి. ఇది మన పర్సనలైజ్డ్ పామ్ సిగ్నేచర్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి షాపింగ్ చేసిన ప్రతిసారి అమెజాన్ వన్ ద్వారా పేమెంట్స్ సులువుగా జరిగిపోతాయి.
ప్రారంభంలో అమెజాన్ వన్ తన గో క్యాషియర్ లెస్ స్టోర్లలో ఈ విధానాన్ని అమలు చేసింది. తరువాత పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో ఈ టెక్నాలజీ ని వినియోగిస్తుంది. అమెరికాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం అక్కడి 200 సూపర్ మార్కెట్లలో ఈ టెక్నాలజీ అమలులో ఉందని సమాచారం. ఈ ఏడాది చివరి వరకు దాదాపు 500 స్టోర్లకు విస్తరించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
Also Read : Oppo K11 5G: మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?