Opera Neon : ఒపెరా కంపెనీ బ్రౌజర్ రంగంలో సరికొత్త విప్లవానికి తెర తీసింది. ‘ఒపెరా నియాన్’ పేరిట బ్రౌజర్‌ను విడుదల చేసింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఆధారిత బ్రౌజర్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ బ్రౌజర్ ద్వారా గేమ్స్ క్రియేట్ చేయొచ్చు. కోడ్‌లు రాయొచ్చు. వెబ్‌సైట్‌లు తయారు చేయొచ్చు. నియాన్ బ్రౌజర్ అనేది ప్రాంప్ట్‌ల ఆధారంగా టాస్క్‌లను పూర్తి చేయగలదు. ‘ఒపెరా నియాన్’(Opera Neon) బ్రౌజర్ క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీని ఉపయోగించగలదు. తద్వారా యూజర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నా టాస్కులను పూర్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బ్రౌజర్‌కు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. కోడింగ్, వెబ్‌సైట్‌లు తయారు చేయడం లాంటి డిజిటల్ పనులను ఈ బ్రౌజర్‌తో ఇట్టే చేసేయొచ్చు. అయితే ఒపెరా నియాన్ బ్రౌజర్ విడుదల తేదీ, సబ్‌స్క్రిప్షన్ రేట్ల వివరాలను ఇంకా ప్రకటించలేదు. బ్రౌజర్ ఆపరేటర్ ఫీచర్‌లో భాగంగా ఈ ఏడాది మార్చిలోనే ఒపెరా ఏఐ ఏజెంట్ టూల్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఆన్‌లైన్ ఫామ్‌లను పూరించడం, బుకింగ్‌లు పూర్తి చేయడం లాంటి టాస్క్‌లను చేస్తోంది.
Also Read :Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
గూగుల్‌కు పోటీగా మన ‘కామెట్’
భారత యువతేజం అరవింద్ శ్రీనివాస్ సారథ్యంలోని కంపెనీ.. పర్‌ప్లెక్సిటీ (Perplexity). ఇదొక ఏఐ టెక్నాలజీ కంపెనీ. ఇప్పుడు దీని టార్గెట్ గూగుల్ బ్రౌజర్. పర్‌ప్లెక్సిటీ కంపెనీ కామెట్ (Comet) పేరుతో బ్రౌజర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని గూగుల్ క్రోమ్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తోంది. Comet ప్రాజెక్టులో ఇప్పటివరకు Nvidia, SoftBank Vision Fund 2, Amazon వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, OpenAI సహ వ్యవస్థాపకుడు ఆంద్రేజ్ కార్పెథీ, Google AI ఎగ్జిక్యూటివ్ జెఫ్ డీన్, Meta కు చెందిన యాన్ లెకున్ వంటి ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద గూగుల్‌కు పోటీ ఇచ్చేందుకు భారతీయులే రెడీ అవుతుండటం గొప్ప విషయం. భారత గడ్డ నుంచి ఇందుకు కసరత్తు జరుగుతుండటం మనకు గర్వకారణం.