ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?

వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.

Published By: HashtagU Telugu Desk
Chatgpt On Whatsapp Ai Chatbot Whatsapp Feature

ChatGPT On Whatsapp: వాట్సాప్‌లో మరో విప్లవాత్మక ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత ఏఐ ఛాట్‌బాట్ ‘ఛాట్ జీపీటీ’ని కూడా ఇక వాట్సాప్ యూజర్లు వాడుకోవచ్చు.  ప్రత్యేకమైన అకౌంటు అక్కర లేకుండానే ఛాట్ జీపీటీని వాడుకోవచ్చు. ఇంతకీ దీన్ని వాట్సాప్‌లో ఎలా వాడుకోవాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Konapapapeta : సముద్రంలో మునిగిపోతున్న కోనపాపపేట.. ఇప్పటికే వందలాది ఇళ్లు మాయం

ఇవి తెలుసుకోండి..

  • వాట్సాప్‌లో ఛాట్ జీపీటీని వాడుకోవాలని భావించే వారు తొలుత +18002428478 నంబరుకు ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేయాలి. ఇందుకోసం నిర్దిష్ట టెలికాం ఛార్జీలు పడతాయి. ఆ వెంటనే మీ వాట్సాప్‌లో ఛాట్ జీపీటీ సేవలు మొదలైపోతాయి.
  • వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు. అలాంటి ఫేక్ కాల్స్ ఒకవేళ వస్తే నమ్మొద్దు.
  • ఛాట్ జీపీటీ సర్వీసులు మన ఫోనులో మొదలయ్యాక..  మనం అడిగే ప్రశ్నలకు అది ఆన్సర్స్  ఇస్తుంది.
  • అయితే ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికా, కెనడాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయని మనం గుర్తుంచుకోవాలి.
  • వాట్సాప్‌లో ఛాట్ జీపీటీని వినియోగించుకోవడంపై కొన్ని పరిమితులు ఉంటాయి. అవేమిటంటే.. ప్రతినెలా 15 నిమిషాలు మాత్రమే వాట్సాప్‌లో ఛాట్ జీపీటీని ఫ్రీగా వాడగలం. డైలీ మెసేజ్ లిమిట్ ఉంటుంది.
  • ఒకవేళ ఈ లిమిట్‌లకు మించి ఛాట్ జీపీటీని వాడాలని భావిస్తే.. ఛాట్ జీపీటీ అఫీషియల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే దాని వెబ్‌సైటులోకి లాగిన్ కావాలి.
  • వాట్సాప్ గ్రూప్ ఛాట్స్‌లోకి ఛాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేయడం అనేది కుదరదు.
  • భవిష్యత్‌లో ఛాట్‌జీపీటీ సెర్చ్‌, ఇమేజ్‌ బేస్డ్‌ ఇంటరాక్షన్‌, కన్వర్జేషన్‌ మెమొరీ లాగ్స్‌ వంటి ఫీచర్లను ఛాట్ జీపీటీ అందుబాటులోకి తేనుంది.
  • ఛాట్‌జీపీటీని మరింత మంది నెటిజన్లకు చేరువ చేసే లక్ష్యంతో ఓపెన్ ఏఐ కంపెనీ, వాట్సాప్ సంయుక్తంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చాయి.

Also Read :Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?

  Last Updated: 19 Dec 2024, 07:29 PM IST