One Plus Diwali Sale అదేంటి రాబోతుంది దసరా కదా అప్పుడే దీపావళి ఆఫర్స్ ఏంటని అనుకోవచ్చు. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఈ క్రమంలో దసరాకి ఎలాగు అన్ని మొబైల్ కంపెనీలు ఆఫర్స్ ఇస్తాయి కాబట్టి వన్ ప్లస్ ప్రత్యేకంగా దీపావళికి స్పెషల్ సేల్ ఏర్పాటు చేస్తున్నారు. వన్ ప్లస్ దీపావళి సేల్ లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వబోతుంది.
వన్ ప్లస్ 11 5జి, వన్ ప్లస్ బడ్స్ ప్రో2, వన్ ప్లస్ (One Plus) ప్యాడ్ ట్యాబ్లెట్ పై ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. వన్ ప్లస్ యాప్ లో 18 నెలల EMI తో ఎంపిక చేసిన మోడల్స్, యాక్ససరీస్ అందించనున్నారు. వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ 49,999 డిస్కౌంట్ ధర తో అందుబాటులో ఉంటుంది. అదనంగా బ్యాక్ ఆఫర్లు ఉపయోగించి 4000 రూ.లు కూడా పొందవచ్చు. ఇండియాలో ఈ ఫోన్ 56,999 రూ.లు ఉంది.
One Plus Diwali Sale వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ధర 17,499 రూ.లు, వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ 28,999 రూ.లు, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ 22,999 రూ.లు ప్రారంభ ధరతో వస్తున్నాయి.వన్ ప్లస్ ప్యాడ్ ధర 36,999 రూ.లతో లభిస్తుంది. వీటితో పాటుగా ఎన్నో స్పెషల్ ఆఫర్స్ తో వన్ ప్లస్ వెబ్ సైట్ లో ఆఫర్లతో అన్ని అందుబాటులో ఉన్నాయి.
Also Read : Paneer : రుచి మాత్రమే కాదు పనీర్ వల్ల లాభాలు ఎన్నో లాభాలు..!