Site icon HashtagU Telugu

50 Years – Single Charge : ఫోన్లలో న్యూక్లియర్ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 50 ఏళ్లు లైఫ్

50 Years Single Charge

50 Years Single Charge

50 Years – Single Charge : రూపాయి బిళ్ల 15x15x5 క్యూబిక్ మిల్లీమీటర్ల సైజు ఉంటుంది. దీని కంటే చిన్న స్థలంలో 63 న్యూక్లియర్ ఐసోటోప్‌లను కలిగి ఉండే బ్యాటరీలు రెడీ అవుతున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ న్యూక్లియర్ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. 50 సంవత్సరాల వరకు పవర్‌ బ్యాకప్ లభిస్తుందని చైనాకు చెందిన టెక్ స్టార్టప్ ‘బీటావోల్ట్’  వెల్లడించింది. అటామిక్‌ ఎనర్జీ బ్యాటరీలను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నామని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, డ్రోన్‌లలో కమర్షియల్‌ పర్పస్‌ కోసం పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. ఛార్జింగ్ అవసరం లేని ఫోన్లు, డ్రోన్లను రూపొందించడాన్ని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా తాముఅటామిక్‌ ఎనర్జీ (అణు శక్తి) మినియేటరైజేషన్‌ను బ్యాటరీల్లో ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్లు బీటావోల్ట్ వివరించింది. ఈ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, ఏఐ డివైజ్‌లు, మెడికల్ ఎక్విప్‌మెంట్‌, మైక్రోప్రాసెసర్‌లు, అడ్వాన్స్‌డ్‌ సెన్సార్‌లు, స్మాల్‌ డ్రోన్‌లు, మైక్రో రోబోట్లకు శాశ్వతంగా విద్యుత్తు సరఫరా అందిస్తాయని తెలిపింది.సోవియట్ యూనియన్, అమెరికా శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో రూపొందించిన సాంకేతికత ఆధారంగా ‘బీటావోల్ట్’  కంపెనీ న్యూక్లియర్ బ్యాటరీలను(50 Years – Single Charge) తయారు చేసింది. ఈ బ్యాటరీ ప్రత్యేక పద్ధతి ద్వారా క్షీణిస్తున్న ఐసోటోపుల నుంచి శక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. గతంలో ఇదే టెక్నాలజీని సైంటిఫిక్‌ స్టేషన్లు, అండర్‌ వాటర్‌ డివైజ్‌లు, అంతరిక్ష నౌక, ఇతర పరికరాల్లో ఉపయోగించారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Green Alerts : తెలుగు సహా 12 భాషల్లో వెదర్ అప్‌డేట్స్.. ఇక హైపర్ లోకల్‌ ఇన్ఫో

ఓవర్‌నైట్‌ చార్జింగ్‌

చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను ఓవర్‌నైట్‌ చార్జ్‌ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుందని చెబుతూ ఉంటారు. అయితే అది చాలా తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్‌ బ్యాటరీ లోపల అదనపు రక్షణ చిప్‌లు ఉంటాయి. అంతర్గత లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్యంలో 100 శాతం తాకినప్పుడు ఛార్జ్‌ అవ్వడం ఆగిపోతుంది. కానీ మీరు మీ ఫోన్‌ను రాత్రిపూట ప్లగ్ ఇన్ చేసి ఉంచితే అది 99 శాతానికి పడిపోయిన ప్రతిసారీ బ్యాటరీ వెంటనే ఛార్జ్ ​ అవుతుంది. తప్ప బ్యాటరీ త్వరగా డ్రెయిన్‌ అవ్వదు. బ్యాటరీను ట్రికిల్ ఛార్జీలు కొంత వేడిని సృష్టించగలవు. చాలా మంది నిపుణులు ఫోన్‌ను రాత్రిపూట ఛార్జ్ చేయడానికి ఫోన్‌ కేసు నుండి తీసివేయాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ సంక్లిష్టమైన రక్షణ కేసుతో ఇది ఎల్లప్పుడూ సాధ్యపడదు. కనీసం ఛార్జింగ్ పరికరం పైన ఏదైనా పుస్తకాలు లేదా ఇతర పరికరాలను పేర్చవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ ఫోన్‌ని మీ దిండు కింద పెట్ట వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫోన్‌ వేడి అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.