Site icon HashtagU Telugu

WhatsApp Pay​​​​ : వాట్సాప్‌‌లో యూపీఐ పేమెంట్.. కేంద్రం గుడ్‌న్యూస్‌

Whatsapp Pay​​​​ Users Upi

WhatsApp Pay​​​​ : న్యూ ఇయర్ వేళ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే వాట్సాప్‌‌ యూపీఐ పేమెంట్ సేవలను దాదాపు 10 కోట్ల మందికిపైగా భారతీయులు వినియోగిస్తున్నారు.  రానున్న కాలంలో మరింత మంది ఆ సేవలను వినియోగించుకునే దిశగా బాటలు వేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర సర్కారు తీసుకుంది.

Also Read :Dil Raju : సినీ పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్‌ రాజు రియాక్షన్

వాస్తవానికి వాట్సాప్‌(WhatsApp Pay​​​​) అనేది  మెసేజింగ్ యాప్. అందులో తొలిసారిగా 2020 సంవత్సరంలో యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను జోడించారు. అయితే ఆ ఫీచర్‌ను ఒకేసారి వాట్సాప్ యూజర్లు అందరికీ అందించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. విడతల వారీగా మాత్రమే ఆ అనుమతులు ఇస్తామని 2020 సంవత్సరంలో మోడీ సర్కారు తేల్చి చెప్పింది. అప్పట్లో తొలి విడతగా 4 కోట్ల మంది యూజర్లకు మాత్రమే వాట్సాప్ యూపీఐ పేమెంట్ సేవలను అందించే అవకాశాన్ని కల్పించింది. 2022 సంవత్సరంలో ఆ సంఖ్యను 10 కోట్ల మందికి కేంద్ర సర్కారు పెంచింది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. మొత్తం 50 కోట్ల మందికిపైగా వాట్సాప్ యూజర్లకు కూడా యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పచ్చజెండా ఊపింది.  దీంతో దేశంలో వాట్సాప్ యూజర్లు అందరికీ వాట్సాప్ పే ఫీచర్ అందేందుకు లైన్ క్లియర్ అయింది.

Also Read :Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్‌ మాక్సిమస్‌’.. ఎందుకు ?

వాస్తవానికి ప్రస్తుతం మన దేశ యూపీఐ మార్కెట్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ విభాగంలో మొదటి రెండు స్థానాల్లో ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి. అయినా వాట్సాప్ పే మెల్లగా తన ఉనికిని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. 2024 సంవత్సరం నవంబరులో వాట్సాప్‌లో 5 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023 సంవత్సరం నవంబరు నెలలో వాట్సాప్‌లో కేవలం 2.2 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంటే ఏడాది వ్యవధిలో లావాదేవీలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అందుకే పూర్తి స్థాయిలో వాట్సాప్ యూజర్లు అందరికీ యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను అందించేందుకు వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతులు మంజూరు చేసింది.