Crossbeats Nexus: టెక్నాలజీ రంగంలో అద్భుతంగా పేర్కొంటున్న ChatGPT రిలీజ్ అయి దాదాపు నాలుగు నెలలు పూర్తయింది. దీని సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఇది మనిషిలా పని చేస్తుందని సంస్థ చెప్తుంది. అయితే చాట్‌జిపిటి ఇప్పటి వరకు వినియోగదారులు వెబ్ మరియు యాప్‌లతో మాత్రమే ఉపయోగించారు. కంపెనీ చెప్పిన ప్రకారం చాట్‌జిపిటిని రిస్ట్-బ్యాండెడ్ స్మార్ట్‌వాచ్‌లో కూడా ఉపయోగించవచ్చు. ChatGPT కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ పేరు క్రాస్ బీట్స్ నెక్సస్(Crossbeats Nexus).
చాట్‌జిపిటి స్మార్ట్ వాచ్ ఫీచర్స్:
చాట్‌జిపిటి స్మార్ట్ వాచ్ 2.1 అంగుళాల స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. క్రాస్‌బీట్స్ నెక్సస్ స్మార్ట్‌వాచ్ రూ. 5,999కి కొనుగోలు చేయవచ్చు. సిల్వర్ మరియు బ్లాక్ రెండు కలర్లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌ను ప్రీ-బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది సంస్థ.కస్టమర్‌లు క్రాస్‌బీట్స్ నెక్సస్ స్మార్ట్‌వాచ్‌ను రూ.999తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేస్తే కంపెనీ నుండి ఉచిత 6 నెలల అదనపు వారంటీ మరియు స్క్రీన్ గార్డ్ లభిస్తుంది.
Also Read: Nokia 105 Classic: నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్స్