Nothing OS : ఆపరేటింగ్ సిస్టమ్.. దీన్నే ‘ఓఎస్’ అని పిలుస్తుంటాం. ఓఎస్ అనగానే మనకు గుర్తుకొచ్చేవి గూగుల్ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావీకి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాని పేరు.. హర్మొనీ ఓఎస్. అయితే అది చైనా ప్రజలకు మాత్రమే పరిమితమైంది. ఈనేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ‘నథింగ్ ఫోన్’ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ల కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను రెడీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఈవిషయాన్ని ఇటీవలే నథింగ్ ఫోన్ సీఈఓ కార్ల్ పై వెల్లడించారు. కార్ల్ పై చైనీయుడు. ఈయన చైనాకు చెందిన వన్ ప్లస్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు.
Also Read :Annakoot Mahotsav 2024 : ఎటు చూసినా లడ్డూలే.. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ‘అన్నకూట్’
యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్(Nothing OS) కంటే బెటర్‌గా ఉండేలా సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆయన తెలిపారు. సొంత ఓఎస్‌ను క్రియేట్ చేయడం ద్వారా తమ కంపెనీ ‘నథింగ్ ఫోన్’కు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తామన్నారు. తమ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)కు చెందిన చాలా ఫీచర్లు అదనంగా ఉంటాయని కార్ల్ పై వివరించారు. తమ ఫోన్లను వాడే వారికి అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీకి ఫండ్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారీ విషయంలో వెనుకంజ వేసేది లేదని కార్ల్ పై స్పష్టం చేశారు.
ఆండ్రాయిడ్ 15లో ‘ప్రైవేట్ స్పేస్’ ఫీచర్
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15లో కొన్ని చక్కటి ఫీచర్లు ఉన్నాయి. ప్రైవేట్ స్పేస్ అనే వర్చువల్ లాకర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మనకు పర్సనల్, సీక్రెట్ అనిపించే యాప్స్‌ను దానిలో దాచుకోవచ్చు. పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ యాప్స్‌ను ‘ప్రైవేట్ స్పేస్’లో దాచుకోవచ్చు.