Nothing Phone: నథింగ్‌ ఫోన్‌ 2పై భారీ డిస్కౌంట్‌.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడ

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 06:15 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లో పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే తాజాగా నథింగ్ ఫోన్ సంస్థ నథింగ్‌ ఫోన్2 పై తాజాగా భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. నథింగ్‌ ఫోన్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. జులై నెలలో నథింగ్‌ ఫోన్‌ 2ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు.

ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏకంగా రూ. 5 వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ తో పాటు, ప్రముఖ రిటైల్‌ సంస్థ క్రోమాలో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ ను అందిస్తున్నారు. రూ. 5వేల డిస్కౌంట్ తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,999 సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ ఫోన్‌ అసలు ధర రూ. 44,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 49,999 గా ఉంది.. అయితే డిస్కౌంట్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక హై ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 54,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 49,999కి సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక 6.7 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌ కెమెరాతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్త్యాన్ని కలిగి ఉండ నుంది..కెమెరాలో సోనీ ఐఎమ్‌ఎక్స్‌90 సెన్సార్‌, 50 ఎంపీ సామ్‌సంగ్‌ జేఎన్‌1 అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను అందించారు.