దక్షిణ కొరియా(South Korea)కు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ శాంసంగ్ (Samsung) వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారత మార్కెట్లోకి Samsung Galaxy S21 FE 5Gను లాంచ్ చేసింది. 256GB ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ తో ఉన్న ఈ ఫోన్ నేవీ, ఆలివ్, లావెండర్, వైట్, గ్రాఫైట్తో సహా 5 కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ.49,999.
ఇందులో నెలకు రూ. 3,334 నుంచి 15 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. గెలాక్సీ S21 FE 5G జూలై 11 నుంచి రిటైల్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.
వెబ్‌సైట్ లోని స్పెసిఫికేషన్స్ జాబితా ప్రకారం ఇది డ్యూయల్ నానోసిమ్ కలిగి ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో 6.4 అంగుళాల పూర్తి HD+ డైనమిక్క్ డిస్ ప్లే, 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంది. 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అయితే ఇది ఒకే ఒక్క 256GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
Also Read : OPPO Phones : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో రెనో 10 5G