Site icon HashtagU Telugu

IPhone Charging : ఐఫోన్ ఛార్జింగ్ సూపర్ ఫాస్ట్ కావాలా ? ఈ టిప్స్ ఫాలోకండి

Iphone Charging Tips

IPhone Charging : ఐఫోన్.. చాలా  కాస్ట్లీ ఫోన్. అధునాతన మొబైల్ ఫోన్ టెక్నాలజీకి మారుపేరు ఐఫోన్. వేరే ఫోన్లతో పోలిస్తే.. దీని ఛార్జింగ్(IPhone Charging) కూడా చాలా  ఫాస్ట్‌గా అవుతుంది. అయితే ఈక్రమంలో కొన్ని చిన్నపాటి టిప్స్‌ను మనం ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టిప్స్

  • ప్రస్తుతం ఐఫోన్​తో కేబుల్ మాత్రమే ఇస్తోంది. పవర్ అడాప్టర్​ను వేరుగా మనం కొనాలి. ఈక్రమంలో మనం కనీసం 20 వాట్ల సామర్థ్యం కలిగిన ఫాస్ట్ ఛార్జర్​ను కొనడం బెటర్.
  • 20 వాట్ల ​ సామర్థ్యంతో యూఎస్​బీ-సీ టూ లైటెనింగ్ కలిగిన పవర్​ అడాప్టర్‌తో స్పీడుగా ఐఫోన్ ఛార్జింగ్ అవుతుంది. ఇది ఐఫోన్​ 8, దాని తర్వాతి తరం మోడల్స్​ను 30 నిమిషాల్లోనే 50 శాతం దాకా చార్జింగ్ చేయగలదు.
  • వైర్ లెస్ ఛార్జింగ్ చాలా ఫాస్టుగా జరుగుతుంది. ‘యాపిల్​ మాగ్​సేఫ్​ ఛార్జర్​’తో ఐఫోన్ 12, ఆ తర్వాతి తరం ఐఫోన్ వర్షన్లను వైర్​లెస్​గా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మన దగ్గర 20 వాట్​ పవర్​ అడాప్టర్​, 15 వాట్​ వైర్​లెస్​ ఛార్జర్ కావాలి. వీటితో మనం ఐఫోన్‌ను 30 నిమిషాల్లోనే 30 శాతం మేర ఛార్జింగ్ చేయొచ్చు.
  • ఐఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు.. దాన్ని వాడొద్దు. ఛార్జింగ్ టైంలో ఐఫోన్‌లో వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా ఛార్జింగ్ స్లో అవుతుంది.
  • వీలైతే ఛార్జింగ్‌కు పెట్టినప్పుడు మీ ఐఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయండి. దీనివల్ల మీ ఛార్జింగ్ స్పీడు పెరుగుతుంది.
  • ఛార్జింగ్‌కు పెట్టినప్పుడు మీ ఐఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయడం ఇష్టం లేకుంటే.. కనీసం దాన్ని ఎయిర్​ప్లైన్​ మోడ్​లో పెట్టండి. దీనివల్ల వైఫై, బ్లూటూత్ ద్వారా పవర్ యూసేజ్ ఆగిపోయి.. ఛార్జింగ్ స్పీడును అందుకుంటుంది.
  • ఐఫోన్‌ను ఛార్జింగ్‌కు(Fast Charging) పెట్టినప్పుడు ‘లో పవర్​ మోడ్’‌ను ఆన్ చేయాలి. దీనివల్ల బ్యాటరీ పవర్‌ను ఎక్కువగా వాడుకునే ఫీచర్ల యాక్టివిటీ తాత్కాలికంగా ఆగిపోతుంది.
  • ఐఫోన్ ఛార్జింగ్ వేళ స్క్రీన్ బ్రైట్​నెస్‌ను తగ్గించండి.
  • ఛార్జింగ్ పెట్టే సమయంలో ఐఫోన్‌ను డార్క్​మోడ్​లో ఉంచాలి. దీనివల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది.
  • యాపిల్ ఐఫోనులో బిల్ట్​-ఇన్​ టూల్​గా ‘ఆప్టిమైజ్డ్​ బ్యాటరీ ఛార్జింగ్’ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మన ఐఫోన్ ఛార్జింగ్ చాలా స్లో అయిపోతుంటుంది. అందుకే ఐఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టిన టైంలో..  ‘ఆప్టిమైజ్డ్​ బ్యాటరీ ఛార్జింగ్’ ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి.  ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో బ్యాటరీ హెల్త్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి ఆప్టిమైజ్డ్​ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి.