Telegram CEO : టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అరెస్టు వార్త అంతటా కలకలం రేపుతోంది. అయితే ఈ అరెస్టుకు రకరకాల కారణాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒక మిస్టరీ మహిళ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఆమె వల్లే పావెల్ దురోవ్ అరెస్టయ్యాడని కొందరు ఆరోపిస్తున్నారు. శనివారం రోజు ఒక ప్రైవేటు విమానంలో అజర్ బైజాన్ నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో దిగిన వెంటనే పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశారు. పావెల్‌తో పాటు సదరు మిస్టరీ మహిళ జూలీ వావిలోవాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరు ?
We’re now on WhatsApp. Click to Join
జూలీ వావిలోవా ఎవరు ?
- 24 ఏళ్ల జూలీ వావిలోవా ఒక క్రిప్టో కోచ్‌గా మంచి పేరు సంపాదించారు. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.
- టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్(Telegram CEO) రష్యాలో పుట్టినప్పటికీ, ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ పౌరసత్వాలు కూడా ఉన్నాయి.
- దుబాయ్‌లోనే పావెల్ దురోవ్‌కు జూలీ వావిలోవా పరిచయం అయ్యారు.
- జూలీ వావిలోవా ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో తనకు గేమింగ్, క్రిప్టో, భాషలు ఇష్టమని రాసుకున్నారు. ఆమెకు ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్, అరబిక్ భాషలు వచ్చు.
- కజకిస్తాన్, కిర్గిస్తాన్, అజర్ బైజాన్‌లకు చాలాసార్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వెళ్లినప్పుడు జూలీ వావిలోవాతో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు, వీడియోలతో జూలీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేసింది.
Also Read :Kolkata Rape Case : లై డిటెక్టర్ పరీక్షలో సంచలన విషయాలు చెప్పిన సంజయ్ రాయ్
- అత్యంత క్లోజ్‌గా ఉండబట్టే పావెల్ దురోవ్‌తో కలిసి జూలీ ప్రైవేటు జెట్‌లో ప్రయాణించగలిగారని స్పష్టమవుతోంది.
- ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ వేసిన హనీ ట్రాప్‌లో పావెల్ దురోవ్ చిక్కుకున్నారని.. జూలీ వావిలోవా ఒక మోసాద్ ఏజెంటు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
- యూరోపియన్ యూనియన్ చట్టాలకు వ్యతిరేకంగా టెలిగ్రామ్ పనిచేస్తున్నందుకే పావెల్ దురోవ్‌ను అదుపులోకి తీసుకున్నామని ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- టెలిగ్రామ్‌ను నేరపూరితంగా వాడుకునే వాళ్లను అరికట్టడంలో విఫలమయ్యారనే అభియోగాలను దురోవ్‌పై ఫ్రాన్స్ అధికార వర్గాలు మోపాయి.