Upcoming Motorola Phone!: అద్భుతమైన ఫీచర్లతో సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న మోటోరోలా ఫోన్!

ప్రముఖ చైనా కంపెనీకి చెందిన మోటోరోలా భారత మార్కెట్లోకి ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లను ప్రవేశ పెట్టబోతోంది. కాగా

  • Written By:
  • Publish Date - August 23, 2022 / 10:20 AM IST

ప్రముఖ చైనా కంపెనీకి చెందిన మోటోరోలా భారత మార్కెట్లోకి ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లను ప్రవేశ పెట్టబోతోంది. కాగా సెప్టెంబర్ 8వ తేదీన వర్చువల్ గా నిర్వహించే కార్యక్రమం ఇందుకు ప్రధాన వేదికగా నిలవనంది. డైమెన్సిటీ 1050 చిప్ సెట్ తో కూడిన మోటరోలా ఎడ్జ్ 2022 ఫోన్ ను పరిచయం చేయనుంది. కాగా మోటో ఎక్స్ 30 ప్రో లేదా మోటో ఎస్ 30 ప్రో మోడల్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోటరోలా ఎడ్జ్ 2022 ఫోన్ ఈ నెల మొదట్లోనే అమెరికాలో విడుదల కానుంది. త్వరలోనే భరత్ మార్కెట్ లోకి కూడా వచ్చేస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి.

డైమెన్సిటీ 1050 చిప్ తో వస్తున్న తొలి ఫోన్ ఇదే. కాగా ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 144 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. దీని వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రెంట్ 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ చార్జర్ తదితర ఫీచర్ లు ఉన్నాయి.

కాగా ఈ ఫోన్ అమెరికాలో దీని ధర రూ.40,000 గా ఉంది. భారత్ లో కూడా ఇదే ధరలో ఉండబోతున్నట్లు సెప్టెంబర్ 8 నాటి కార్యక్రమంలో మోటరోలా ఇంకా ఏవేవి విడుదల చేయనున్నదీ అన్నది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.