Motorola: మోటరోలా ఎడ్జ్ 30 సిరీస్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!

చైనా కు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా తన ఎడ్జ్ సిరీస్ ఫోన్ లను విస్తరించే నేపథ్యంలో ఈ నెల

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 10:15 AM IST

చైనా కు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా తన ఎడ్జ్ సిరీస్ ఫోన్ లను విస్తరించే నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన భారత మార్కెట్ లోకి ఎడ్జ్ సిరీస్ నుంచి రెండు సరికొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ మోటరోలా ఈ మధ్యకాలంలో భారత మార్కెట్ లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అయితే పలు ధరల శ్రేణి లో వరుసగా స్మార్ట్ ఫోన్ లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది మోటరోలా. కాగా ఈనెల 13వ తేదీన భారత మార్కెట్ లోకి ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను విడుదల చేయనుంది.

అయితే ఈ ఫోన్ లలో పలు ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్స్ తో పాటుగా వీటిల్లో కొన్ని సరి కొత్త ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 6.67 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ కర్వ్ డ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. అలాగే ఇందులో క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 8 ప్లస్ జనరేషన్ 1ను ఏర్పాటు చేశారు. ఇక బ్యాక్ కెమెరా 200 మెగాపిక్సల్ గా ఉంటుంది. అలాగే, 50 మెగా పిక్సల్, 12 మెగా పిక్సల్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ముందు భాగంలో 60 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక ఎడ్జ్ 30 ఫ్యూజన్ 6.55 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో రానుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్ ఇందులో ఉంటుంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. యూరోప్ లో ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఇక అక్కడి ధరల ప్రకారంగా చూసుకుంటే ఎడ్జ్ 30 అల్ట్రా రూ.73వేలు కాగా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఆరంభ ధర రూ.48,000గా ఉంది.