5G Smart Phones:మోటో జీ62, 5 జీ రిలీజ్.. ఈ ఫోన్ ఫిచర్లు, ప్రకత్యేకతలు ఇవే!

ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది మోటోరోలా. మరి ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ ను టార్గెట్

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 09:15 AM IST

ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది మోటోరోలా. మరి ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ ను టార్గెట్ చేసుకున్న మోటోరోలా కంపెనీ భారత మార్కెట్ లోకి కొత్త కొత్త ఫోన్‌ లను లాంచ్‌ చేస్తోంది. అయితే అన్ని రకాల ధరల శ్రేణిలో మోటో ఫోన్ ఉండాలి అన్నా వ్యూహంతో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా తాజాగా మోటో జీ62 5జీ ఫోన్ ను విడుదల చేసింది. రెండు రకాల వేరియంట్ లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీ ధర రూ.17,999 కాగా 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది.

హెచ్ డీఎఫ్ సీ కార్డు పై కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫ్ బరోడా, సిటీ బ్యాంకు కార్డుదారులకు 10 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో ఫీచర్ ల విషయానికి వస్తే 6.55 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీతో ఉంటుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. దీనికి ఐపీ52 రేటింగ్ కూడా ఉంది. నీరు,దుమ్ము నుంచి ఫోన్ కు రక్షణ లభిస్తుంది. అంటే నీటి బిందువులు పడినా ఫోన్ కు ఏమీ కాదు. అలా అని ఫోన్ మొత్తం నీటిలో పడిపోతే రక్షణ ఉండదు. అలాగే ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి.

వాటిల్లో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సల్ తో ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇక బ్యాటరీ 5,000 ఎంఏహెచ్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో పనిచేస్తుంది. ఒక ఆండ్రాయిడ్ వెర్షన్ కు భవిష్యత్తులో అప్ గ్రేడ్ కావచ్చు. ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.