WhatsApp: వాట్సాప్ చాట్స్ కు మరింత సెక్యూరిటీ.. “చాట్ లాక్” ఫీచర్ రెడీ..!

వాట్సాప్ (WhatsApp)లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ చాట్స్ (WhatsApp Chats)ను కూడా లాక్ చేసే వెసులుబాటును కల్పించే సరికొత్త ఫీచర్ ను వాట్సాప్  కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమంది బీటా వర్షన్ వాట్సప్ యూజర్స్ కు అందుబాటులోకి వచ్చేసింది.

  • Written By:
  • Publish Date - April 26, 2023 / 03:54 PM IST

వాట్సాప్ (WhatsApp)లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ చాట్స్ (WhatsApp Chats)ను కూడా లాక్ చేసే వెసులుబాటును కల్పించే సరికొత్త ఫీచర్ ను వాట్సాప్  కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమంది బీటా వర్షన్ వాట్సప్ యూజర్స్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే  కేవలం ఫింగర్ ప్రింట్ ద్వారా మీరు ఎంపిక చేసిన వ్యక్తులతో చేసిన చాట్ సెక్షన్ ను ఓపెన్ చేయగలుగుతారు.  అంతేకాదు లాక్ చేసిన చాట్  సెక్షన్ కు పంపిన, అక్కడి నుంచి వచ్చిన ఫోటోలు, వీడియోలు ఫోన్ లోని  గ్యాలరీలో సేవ్ కూడా కావు. వినియోగదారుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ లను పరిగణనలోకి తీసుకొని వాట్సాప్ ఈ ఫీచర్ ను ప్రవేశ పెట్టిందని “వ్య బీటా  ఇన్ఫో” వెబ్ సైట్ ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది.

◆ “వ్య బీటా ఇన్ఫో”  స్టోరీలో  ఏముంది..?

” వాట్సప్ చాట్ లోని కొన్ని మెసేజెస్ ను భద్రంగా ఉంచాలని భావించే  వారికి చాట్ లాక్ ఫీచర్  ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ దీన్ని ట్రై చేయాలని భావించే యూజర్స్.. గూగుల్ ప్లేస్టోర్ లోని  వాట్సాప్ బీటా  ఆండ్రాయిడ్ లోని  2.23.9.14 వర్షన్ కు అప్ డేట్ కావాలి.  అయితే అందరికీ ఈ ఫీచర్ కనిపించకపోవచ్చు. కొంతమంది లక్కీ వాట్సప్ యూజర్స్ కు మాత్రమె  చాట్ లాక్ ఫీచర్ కనిపిస్తుంది”  అని “వ్య బీటా ఇన్ఫో” వెబ్ సైట్  తన న్యూస్ స్టోరీలో  ప్రస్తావించింది.

◆ నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్‌

వాట్సాప్‌ ఒక ఫోన్‌తో ఉంటే, మరో ఫోన్‌లో కూడా ఒకేసారి దాన్ని వాడుకోవడం కుదరదు. వేరే బ్రౌజర్‌లో, ప్యాడ్‌లో, ల్యాప్‌టా్‌పలో మాత్రం లాగిన్‌ కావచ్చు. అయితే.. ఒక నంబర్‌తో ఒకేసారి ఎక్కువ ఫోన్లలో లాగిన్‌ అయ్యే అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ముఖ్యంగా చిరువ్యాపారులకు ఈ ఫీచర్‌తో ఎక్కువ ఉపయోగం ఉండనుంది. వారు ఒకే నంబర్‌తో ఉన్న వాట్సాప్‌ ఖాతాలోకి నలుగురు సిబ్బంది, నాలుగు ఫోన్లలో లాగిన్‌ అయ్యి.. అన్నింటి ద్వారా ఒకేసారి లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది.

Also Read: Drink More Of Water: వేసవిలో నీరు ఎక్కువ తాగాలి..? ఈ సమ్మర్ లో అధిక నీటిని తాగడానికి ఈ టిప్స్ పాటించండి..!

దీనివల్ల పనిలో వేగం పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ అప్‌డేట్‌ను విడుదల చేశామని, మరికొన్ని వారాల్లో అందరికీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని జుకర్‌బర్గ్‌ వివరించారు. ఈ అప్‌డేట్‌తో నాలుగు ఫోన్లలో ఒకే నంబర్‌తో వాట్సాప్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఒకటి మాత్రమే ప్రధాన ఫోన్‌గా ఉంటుంది. మిగతా మూడూ దానికి అనుసంధానమై పనిచేస్తాయి. వాటిలో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి లాగిన్‌ అయ్యే సమయంలో నంబర్‌ ఇచ్చే చోట ‘లింక్‌ టు ఎగ్జిస్టింగ్‌ అకౌంట్‌’ అనే ఆప్షన్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఒక క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. దాన్ని మీ ప్రధాన ఫోన్‌లోని వాట్సాప్‌ ఖాతాలో ఉన్న ‘లింక్‌ ఏ డివైస్‌’ ఆప్షన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే రెండో ఫోన్‌లోకి ఇదే నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు.