Site icon HashtagU Telugu

AnTuTu Score : మీకు ఫోన్ ఉందా ? AnTuTu స్కోర్ గురించి తెలుసా ?

Mobile Phone Companies Antutu Score Mobile Phones

AnTuTu Score : మనకు క్రెడిట్ స్కోరు తెలుసు. సిబిల్ స్కోరు తెలుసు. కానీ చాలామందికి ఆంటుటు స్కోరు (AnTuTu score) తెలియదు. ఏమిటిది ? ఇది దేనికి ప్రమాణం ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :MLAs Defection Case: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరోసారి ‘సుప్రీం’ నోటీసులు.. కారణమిదీ

ఆంటుటు స్కోరు.. ఎందుకు ? 

ఇది స్మార్ట్‌ యుగం. ఎంతోమంది స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను కొంటున్నారు, వాడుతున్నారు.. మనం ఏదైనా ఫోన్, ట్యాబ్‌ను కొనే ముందు దాని  ఆంటుటు స్కోరు (AnTuTu score)ను తెలుసుకోవాలి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌‌ల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణమే ఈ స్కోరు. గీక్‌బెంచ్‌, 3డీ మార్క్‌ వంటివి చెక్ చేశాక.. మనం స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను కొనొచ్చు. ఫోన్లు, ట్యాబ్‌ల వేగం (CPU), గ్రాఫిక్స్‌ (GPU), ర్యామ్‌ (RAM), యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ (UX) వంటి వాటిని పరీక్షించి వాటి సామర్థ్యాన్ని తెలియజేయడమే ఆంటుటు స్కోరు ప్రత్యేకత. ఈ స్కోరును ఒక సంఖ్య రూపంలో ఇస్తారు. AnTuTu స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. ఫోన్లు, ట్యాబ్‌లు అంత పవర్ ఫుల్ అని అర్థం. అవి అంత మెరుగ్గా, వేగంగా పనిచేస్తాయని అర్థం.

Also Read :Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్

ఆంటుటు స్కోరు.. ఎంత ఉండాలి ? 

ఉదాహరణకు 4 లక్షల ఆంటుటు స్కోరున్న ఫోన్ కంటే 8 లక్షల ఆంటుటు స్కోరున్న ఫోన్ రెట్టింపు పవర్ ఫుల్. ఎక్కువ ఆంటుటు స్కోర్ ఉన్న ఫోన్‌లో ఒకేసారి  ఎక్కువ యాప్స్‌‌ను ఓపెన్‌ చేసినా ఫోన్‌ హ్యాంగ్‌ కాదు. పెద్ద ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడినా, అవాంతరాలు ఎదురు కావు.  తక్కువ స్కోరున్న ఫోన్లను వాడితే  అవి తరుచుగా హ్యాంగ్ అవుతాయి. స్క్రీన్ బ్లాక్ అవుతుంది. యాప్‌లు మూసుకుపోతాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, ట్యాబ్‌ తయారీ కంపెనీలు తమ ఆంటుటు స్కోరు గురించి వాణిజ్య ప్రకటనల్లో  స్పష్టంగా ప్రస్తావిస్తుంటాయి. గేమ్స్ ఆడేవారు, వర్క్ ఫ్రం హోం చేసే వారు, క్రియేటివ్ వర్క్ చేసేవారు, గ్రాఫిక్స్ వర్క్ చేసేవారు తప్పకుండా డివైజ్‌ల ఆంటుటు స్కోరును తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలి.  కాల్స్, మెసేజ్‌లు, సాధారణ యాప్‌లను వాడే ఎంట్రీ లెవల్ ఫోన్లలో ఆంటుటు స్కోరు 2 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుంది. మల్టీటాస్కింగ్‌, గేమ్‌లు ఆడేందుకు వాడే మిడ్ రేంజ్ ఫోన్లకు 4 లక్షల నుంచి 7 లక్షల దాకా ఆంటుటు స్కోర్‌ ఉండాలి. హై ఎండ్‌ గేమింగ్‌, వీడియో ఎడిటింగ్ వంటి  వాటి కోసం వాడే ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఆంటుటు స్కోరు 7 లక్షల నుంచి 15 లక్షల దాకా ఉంటుంది.

ఆంటుటు స్కోరు.. ఎలా చెక్ చేయాలి ?