AI In WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. త్వరలోనే ఏఐ టూల్ లాంచ్..?

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ (AI In WhatsApp) సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

  • Written By:
  • Updated On - November 16, 2023 / 02:26 PM IST

AI In WhatsApp: ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ (AI In WhatsApp) సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. కాగా ఇప్పటికే వాట్సాప్ సంస్థ ప్రైవసీ విషయంలో ప్రొఫైల్ విషయంలో స్టేటస్ విషయంలో చాటింగ్ విషయంలో ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. అయితే త్వరలోనే మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే…ఇటీవల కాలంలో మెటాకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ కూడా ఏఐ ఫీచర్లను పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సపోర్ట్ క్వెరీల కోసం మెసేజ్‌లు రూపొందించడానికి కృత్రిమ మేధస్సు ఏఐని ఉపయోగించే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌ 2.23.23.8లో ఈ ఫీచర్‌ కనిపించింది. కాగా ఏఐ సపోర్ట్ అని పిలిచే ఈ స్పెసిఫికేషన్‌ ద్వారా ఏఐ జనరేటెడ్ రెస్పాన్సెస్ పొందడానికి వాట్సాప్ సెట్టింగ్స్, హెల్ప్,కాంటాక్ట్ అస్ పై క్లిక్ చేయాలి. అయితే ప్రస్తుతం వాట్సాప్ డెవలపర్లు దీనిని అభివృద్ధి చేస్తున్నారట.

Also Read: Disney+ Hotstar: టీమిండియా క్రికెటర్లే కాదు అభిమానులు కూడా చరిత్ర సృష్టించారు.. ఏ విషయంలో అంటే..?

ఇకపోతే త్వరలోనే విడుదల కాబోతున్న ఈ ఏఐ ఫీచర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఏఐ ద్వారా జనరేట్ అయిన మెసేజ్‌లు పంపడానికి యాప్ మాతృ సంస్థ అయిన మెటా నుంచి సెక్యూర్‌ ఉపయోగిస్తుంది. కాబట్టి ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు. అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది. అయితే ఏఐ యూజర్ ప్రశ్నలకు మరింత రిలవెంట్, హెల్ప్‌ఫుల్ రెస్పాన్స్‌లు అందిస్తుందని చెప్పవచ్చు. ఏఐ ఫీచర్ యూజర్ ఇంటరాక్షన్లను సింపుల్ చేస్తుంది, రెస్పాన్స్ టైమ్‌ తగ్గిస్తుంది. వాట్సాప్ యూజర్లు కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు మరింత ఎఫీషియెంట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఏఐ జనరేటెడ్ మెసేజ్‌లు వాట్సాప్ కస్టమర్ సపోర్ట్‌కు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయట. ఎందుకంటే అవి యూజర్ ఎంక్వయిరీస్ కోసం మోర్ పర్సనలైజ్డ్‌, ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అందిస్తాయని వాట్సాప్ డేటా పేర్కొంది.