Iphone 14: ఐఫోన్ 14 పై భారీ తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాలు ఐఫోన్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 06:40 PM IST

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాలు ఐఫోన్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసింది. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయిన ఐఫోన్ 14 మోడల్స్ కి మంచి క్రేజ్ దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్‌ 14 పై ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మాపుల్ స్టోర్‌ లేదంటే ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవ​చ్చు. అలాగే నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్‌ 14ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్‌ 14, 512జీబీ ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్‌లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్‌ఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా కలిపి రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్‌ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్‌ల పై కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ లను పొందవచ్చు.

అయితే ఈఎంఐ పై ఫోన్‌ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్‌ను మాపుల్‌ కల్పిస్తోంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్‌ పేమెంట్‌తో ఐఫోన్‌ 14ను అందిస్తోంది.