Secret Code : వాట్సాప్ ఛాట్స్‌‌కు ‘సీక్రెట్ కోడ్‌’తో లాక్.. ఛానల్స్‌కు ‘యూజర్ నేమ్’

Secret Code : వాట్సాప్‌లో ఛాట్స్‌ను హైడ్ చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 01:36 PM IST

Secret Code : వాట్సాప్‌లో ఛాట్స్‌ను హైడ్ చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనికి అదనపు లేయర్‌గా మరో ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతోంది. మన వాట్సాప్ ఛాట్స్‌‌కు ఒక సీక్రెట్ కోడ్‌తో రక్షణ కల్పించే వెసులుబాటును కల్పించడమే ఆ ఫీచర్ ప్రత్యేకత. మనం ఆ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే హైడ్ చేసిన ఛాట్స్ కనిపిస్తాయి. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఈ ఫీచర్ ప్రస్తుతానికి  వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని వెంటనే వాడాలని భావిస్తే.. వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.24.20 బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఫీచర్‌ను వాడాలంటే మీరు తొలుత వాట్సాప్‌లోని లాక్డ్ ఛాట్స్ లిస్ట్ ఓపెన్ చేయాలి.  దాని ఎగువ భాగంలో కనిపించే మూడు చుక్కల మెనూను ఓపెన్ చేయాలి. అందులో ఛాట్ లాక్ సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ అనే ఆప్షన్ ‘ఎనేబుల్’ చేయాలి. ఈక్రమంలో మీరు అక్కడ ఒక సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.  దాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ఈ కోడ్‌ను మరిపోయి.. రీసెట్ చేయాలని భావిస్తే లాక్ చేసిన ఛాట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు ఈవిధంగా లాక్ చేసి, హైడ్ చేసిన వాట్సాప్ ఛాట్స్‌.. కనీసం లాక్డ్ ఛాట్స్ కేటగిరిలో కూడా కనిపించబోవు. సెర్చ్ బార్‌లో మీరు మీ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి. ఈ ఫీచర్ వల్ల తమ యూజర్స్ ప్రైవసీ మరింత మెరుగుపడుతుందని వాట్సాప్ భావిస్తోంది.

Also Read: Gujarat: గుజరాత్ లో దారుణం, కోతుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి

ఒకవేళ మీరు ఫింగర్ ప్రింట్ లాకింగ్ మెకానిజం కావాలని భావిస్తే ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఆప్షన్‌ను డిజేబు చేయాలి. మీరు  లాక్ చేసిన ఛాట్లు ఆ వెంటనే మీ మెయిన్ వాట్సాప్  ఛాట్ లిస్టులో కనిపిస్తాయి.  ఇక వాటిని ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ అవసరం అవుతుంది. వాట్సాప్ ఛానల్స్‌కు యూజర్ నేమ్ అందించే మరో కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఒక్కసారి యూజర్ నేమ్ సెట్ చేశాక.. ఛానెల్ సబ్‌స్క్రైబర్లు.. ఛానల్స్ సెక్షన్‌లోని సెర్చ్ బార్‌లో యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఛానెల్‌ను(Secret Code) ఓపెన్ చేయగలుగుతారు.