Jio Tag : పోయిన వస్తువులు దొరకబట్టే జియో ట్యాగ్.. స్పెషల్ ఆఫర్ కూడా ఉంది.. ఎలా పనిచేస్తుందంటే…

జియో ట్యాగ్ (Jio Tag) మన పర్సనల్ వస్తువులను ట్యాగ్ చేసి సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే బ్లూటూత్​తో వచ్చే లాస్ట్ అండ్ ఫౌండర్ ట్రాకర్ (lost and found tracker )అన్నమాట.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 10:00 PM IST

బయటకు వెళ్లే ముందు ఒక్కోసారి ఒక్కోటి మరచిపోతాం.. ఫోన్ అయితే వేరేవాళ్ళ మొబైల్ నుంచి రింగ్ ఇచ్చి ఆ సౌండ్ పట్టుకుని వెతకాచ్చు కానీ అదే వాలెట్(wallets), కీస్ (keys), హ్యాండబాగ్స్ (Handbags) అయితే.. వాటికి రింగ్ ఇచ్చే ఆప్షన్ ఉండదు కదా.. ఒక్కసారి వీటిని వెతకడంలోనే గంటలు గంటలు గడిచిపోతాయి.

ఇలాంటి పరిస్థితిలో మనం ఈజీగా మన వస్తువులను ట్రాక్ చేసే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది జియో. జియో ట్యాగ్ (Jio Tag) మన పర్సనల్ వస్తువులను ట్యాగ్ చేసి సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే బ్లూటూత్​తో వచ్చే లాస్ట్ అండ్ ఫౌండర్ ట్రాకర్ (lost and found tracker )అన్నమాట. యాపిల్ ఎయిర్ ట్యాగ్​కు(Apple’s AirTag), ఇది చాలా దగ్గరగా ఉండి, మన బడ్జెట్ లో ఉన్న ట్రాకర్ ఇది. ఇది ఇండోర్‌లో 20 మీటర్లు, అవుట్‌ డోర్‌లో 50 మీటర్ల వరకు పని చేస్తుంది. ఇందులో ఉండే CR2032 బ్యాటరీ జీవితకాలం ఒక సంవత్సరం. అయితే తరువాత దానిని రీప్లేస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ v5.1ని ఉపయోగించి దీనిని మన స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.ఒకవేళ మన ఫోన్ సైలెంట్ లో ఉన్నట్లయితే ఈ డివైజ్ సాయంతో రింగ్ చేసి వెతుక్కోవచ్చు.

జియో థింగ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆ తర్వాత మన మొబైల్ ని సెటప్ చేసుకోవాలి. ఇక ఈ ట్యాగ్ ను మనకి దేనికి కావాలంటే దానికి తగిలించొచ్చు. కీ చైన్స్, పర్స్,బ్యాగ్స్.. దీనివల్ల డివైజ్‌ను పోగొట్టుకున్నా అదెక్కడ పోయిందో తెలుసుకునే వీలుంటుంది. జియో కమ్యూనిటీ నెట్‌వర్క్ అనే ఆప్షన్ సహాయంతో దీన్ని కనుక్కోవచ్చు. జియో థింగ్స్ యాప్‌లోనే ఈ ఫీచర్ కూడా ఉంటుంది.
ఒకవేళ మీరు జియో ట్యాగ్ తగిలించిన వస్తువును వదిలి నిర్ధేశిత దూరం దాటి వెళ్లిపోతే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఆ వస్తువు పోయినా లేక దొంగలించబడినా జియో థింగ్స్ యాప్ లోని జియో కమ్యూనిటీ( Jio Community )లో రిపోర్ట్ చేయాలి. అప్పుడు ఆ వస్తువు చివరిసారి నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని మన ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది.

దీని అసలు ధర రూ. 2,199 అయితే ప్రస్తుతం దీనిని ఆఫర్ కింద కేవలం రూ. 749కే అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, జియో వెబ్ సైట్లలో ఇది అందుబాటులో ఉంది. దాదాపు ఇదే ఫీచర్స్ తో ఉన్న యాపిల్ ఎయిర్ ట్యాగ్ ధర రూ. 3,490.

 

Also Read : EMI Offer: రోజుకి రూ.30 తో 5 జీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే?