Telecom Network Maps: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే టెలికాం కంపెనీలన్నీ కలిసి మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. వాటి నెట్‌వర్క్ ఆన్‌లైన్ కవరేజీ మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా టెలికాం యూజర్లు తమ ఏరియాలో నెట్‌వర్క్ సిగ్నల్స్ ఉన్నాయా ? లేదా ? ఎంతమేరకు ఉన్నాయి ? అనేది కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు ఈ ఫీచర్‌ను జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి సంబంధించిన వెబ్‌సైట్ అడ్రస్‌లను మీరు కింద చూడొచ్చు.
- జియో కవరేజీ మ్యాప్ : https://www.jio.com/selfcare/coverage-map/
- ఎయిర్‌టెల్ కవరేజీ మ్యాప్: https://www.airtel.in/wirelesscoverage/#
- వొడాఫోన్ ఐడియా కవరేజీ మ్యాప్: https://www.myvi.in/vicoverage/
Also Read :Betel Leaves : తమలపాకు, మణిపూసల మాలలకు జీఐ ట్యాగ్.. ఎందుకు ?
వెబ్‌సైట్లలో ప్రత్యేక విభాగాలు..
పైన ఇచ్చిన వెబ్‌సైట్లలోకి వెళితే.. మనకు టెలికాం నెట్‌వర్క్ కవరేజీ మ్యాప్స్ కనిపిస్తాయి. వాటి ద్వారా మనం నివసించే ఏరియాలో వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ సేవల నెట్‌వర్క్ కవరేజీపై(Telecom Network Maps) పూర్తిస్థాయి క్లారిటీకి రావచ్చు. టెలికాం సేవల్లో నాణ్యతను మెరుగుపర్చేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఎయిర్‌టెల్‌లో ‘చెక్ కవరేజీ’ పేరుతో, జియోలో ‘కవరేజీ మ్యాప్’ పేరుతో, వొడాఫోన్ ఐడియాలో ‘నెట్‌వర్క్ కవరేజీ’ పేరుతో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. వాటిలో ఈ మ్యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ కంపెనీ 2జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కవరేజీ వివరాలను అందిస్తోంది. జియో 4జీ, 5జీ నెట్‌వర్క్ కవరేజీ వివరాలను అందిస్తోంది. వొడాఫోన్ ఐడియా 2జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్ కవరేజీ ఏరియాలను చూపిస్తోంది.
బీఎస్ఎన్ఎల్‌లో ఇంకా.. ?
ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో ఇంకా ఈ విభాగాన్ని యాడ్ చేయలేదు. ట్రాయ్ అనేది కేంద్ర ప్రభుత్వ విభాగం. అదే కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీఎస్ఎన్‌ఎల్ ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే బీఎస్ఎన్‌ఎల్‌లో ఫీచరలను ఆలస్యంగా తీసుకొస్తారా ? ఇతర టెలికాం కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఇదంతా జరుగుతుందా ? అనే కోణంలో చర్చ జరుగుతోంది.