Site icon HashtagU Telugu

Smartphone : ఫోన్ స్లో అవుతోందా ? ఫాస్ట్ చేసే టిప్ ఇదిగో

Smartphone

Smartphone

Smartphone :  మీ  స్మార్ట్‌ఫోన్ స్లో అవుతోందా ? స్లో కావడంతో.. ఫోన్ వాడాలంటేనే చికాకుగా ఉందా ? ఈ సమస్యను అధిగమించే ఒక పవర్ ఫుల్ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా  ఫోన్‌లో తక్కువ మెమొరీ ఉండటం, తక్కువ స్టోరేజీ ఉండటం వల్ల స్లో అవుతుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసినా ఫోన్ స్లో అవుతుంది. ఇవన్నీ కాకుండా మరో ముఖ్యమైన కారణం వల్ల కూడా ఫోన్ స్లో అవుతుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఫోన్‌ను మనం వాడటం వల్ల.. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం వల్ల ఏర్పడే ఫైల్స్‌ను క్యాచే అంటారు. ఒకవేళ మీ ఫోన్ ఫాస్ట్‌గా పనిచేయాలని అనుకుంటే.. అందులో యాప్స్‌కు సంబంధించిన క్యాచేను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. ఇందుకోసం మీ ఫోన్‌లో తొలుత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసి.. యాప్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో మీరు ఏ యాప్ కాష్ క్లియర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. అందులో స్టోరేజ్‌పై క్లిక్ చేయండి.  క్యాచే డేటాపై క్లిక్ చేసి, ‘ఓకే’ ఆప్షన్ నొక్కితే మీ యాప్ క్యాచే డేటా క్లియర్ అయిపోతుంది.  మీ ఫోన్ ర్యామ్ 4 లేదా 6 జీబీగా ఉండి.. ఒకవేళ క్యాచేను క్లియర్ చేయకపోతే ర్యామ్ ప్రాసెసింగ్ స్లో అవుతుంది. ఫలితంగా ఫోన్ స్లోగా నడుస్తుంది. మీరు ఎప్పటికప్పుడు ఈ క్యాచేలను క్లియర్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటే.. ది బెస్ట్ ప్రాసెసర్‌ ఉన్న ఫోన్‌ను కొనండి. అలాంటి ఫోన్స్ ఎక్కువ కాలం స్లో కాకుండా(Smartphone) నడుస్తాయి.

Exit mobile version