Site icon HashtagU Telugu

IPhone 14 Battery Draining : ఏడాదైనా కాకముందే.. ఐఫోన్ 14లో బ్యాటరీ సమస్యలు!

Iphone 14 Battery Draining

Iphone 14 Battery Draining

IPhone 14 Battery Draining : టెక్ దిగ్గజం యాపిల్ iPhone 14,  iPhone 14 Pro స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను 2022 సెప్టెంబర్ 16న ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేసింది.  ఇప్పుడు ఆ మోడల్  ఫోన్లలో పలు రకాల బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్స్ మండిపడుతున్నారు. ఫోన్ కొని కనీసం ఏడాదైనా గడవకముందే ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అని వాపోతున్నారు.తమ ఫోన్లలోని బ్యాటరీ సమస్యలను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. “నా iPhone 14 Pro బ్యాటరీ కెపాసిటీ 88 శాతానికి డౌన్ అయింది. ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఈ సమస్య తలెత్తిందా? ఈ సమస్యకు 450 ఛార్జ్ సైకిల్స్ కారణమా? లేక ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఇలా జరుగుతోందా? బ్యాటరీలో ఏదైనా సమస్య ఉందా?” అని ఒక నెటిజన్  ట్వీట్ చేశాడు.

Also read : Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి

“నా iPhone 14 ప్రో బ్యాటరీ లైఫ్ దారుణంగా (IPhone 14 Battery Draining) పడిపోయింది. ఉదయం 8 గంటలకు ఫుల్ ఛార్జ్ చేశాను. సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో అయిపోయింది” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.  అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ జోవన్నా స్టెర్న్ కూడా తన iPhone 14లోని బ్యాటరీలో ఏర్పడిన సమస్యల గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Also read : Peanut Chikki : పల్లిపట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

వినియోగదారుల సమస్యకు పరిష్కారం ఏమిటి ?

గతంలో ఐఫోన్ 14 బ్యాటరీ సమస్యల గురించి యాపిల్ ఏం చెప్పిందనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ టాపిక్ లోకి వెళితే.. “iPhone బ్యాటరీలు 500 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ తర్వాత వాటి ఛార్జింగ్ పరిమితిని 80 శాతానికి పరిమితం చేయాలి” అని గతంలోనే Apple సూచించింది. అయితే ఇప్పుడు 500 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ పూర్తికాక ముందే బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతోంది. ఈనేపథ్యంలో రాబోయే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 10 నుంచి  18 శాతం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుత వినియోగదారుల సమస్యలను యాపిల్ కంపెనీ ఎలా పరిష్కరిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.