Iphone 13 Cheaper: భారత్ లో ఐఫోన్ -13పై అదిరిపోయే డిస్కౌంట్…ఎంతో తెలుసా..?

యాపిల్ ఐఫోన్ 13పై భారత్ భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ. 35, 513లకే ఐఫోన్ -13ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 06:00 AM IST

యాపిల్ ఐఫోన్ 13పై భారత్ భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ. 35, 513లకే ఐఫోన్ -13ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ మాపుల్ స్టోర్ నుంచి వచ్చే పలు ఆఫర్లను పరిగణలోనికి తీసుకుంటే 128జీబీ కెపాసిటి గల ఐఫోన్ 13 ధర తగ్గుతుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,990. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సమ్మర్ సేల్ 2022లో రూ. 66, 900లకే ఐఫోన్ 13 అందిస్తున్నట్లు ప్రకటించింది.

మాపుల్ స్టోర్ వెబ్ సైట్ ప్రకారంగా చూసినట్లయితే 128జీబి కెపాసిటి గల యాపిల్ ఐఫోన్ 13 ఫోన్ పై భారీగా రూ. 44, 477డిస్కౌంట్ అందిస్తుంది. దీని ప్రకారం ఐఫోన్ 13 రూ. 35, 513లకు లభ్యం అవుతుంది. ఐఫోన్ 13పై లభించే డిస్కౌంట్లో మాపుల్ ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్ రూ. 10,387, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసినట్లయితే రూ. 5,000ల వరకు క్యాష్ బ్యాక్ , ఎక్స్చేంజ్ బోనస్ రూ. 5000 బై బ్యాక్ వాల్యూ రూ. 24వేలు. కాగా ఐఫోన్ 11 మంచి కండీషన్లో ఉంటేనే ఎక్స్చేంజ్ బోనస్ లభించనుంది. అది కూడా మాపుల్ స్టోర్ లోనే కొనుగోలు చేయాలి.

ఐఫోన్13లో పలు రకాల మోడల్స్ ను బట్టి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లభించనున్నాయి. మీరు ఒక ఫోన్ కొనుగోలు చేస్తే…బై బ్యాక్ ఆఫర్ కోసం రీసెల్లర్ వెబ్ సైట్లో మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ఈ మధ్యే ప్రకటిచిన ప్రకారం అమెజాన్ సమ్మర్ సేల్ -2022 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13లో 6.1అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే విత్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఆపిల్ ఏ 15 బయోనిక్ చిప్ 12 మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉంటాయి.