iPhone Cheap: క్రోమా.. ఐఫోన్ 13 బంపర్ ఆఫర్లు వినుమా.. రూ.79,900 ఫోన్ రూ.49,900 కే!!

సరికొత్త ఐఫోన్13 మోడళ్లపై ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. క్రోమా స్టోర్లలో భారీ తగ్గింపు లభిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Iphone Imresizer

Iphone Imresizer

సరికొత్త ఐఫోన్13 మోడళ్లపై ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. క్రోమా స్టోర్లలో భారీ తగ్గింపు లభిస్తోంది. దాని అసలు ధర రూ.79,900. క్రోమా స్టోర్లు దీనిపై రూ.10000 తగ్గింపు ప్రకటించాయి.

అంటే.. ధర రూ.69,900 కు చేరింది. ఒకవేళ hdfc bank కార్డు ఏదైనా ఉంటే .. మరో రూ.4000 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దీంతో ధర మరింత తగ్గి రూ.65,900కు చేరుతుంది. ఇది ఇంకా తగ్గాలన్నా ఒక ఉపాయం ఉంది. మీ వద్దనున్న పాత ఐఫోన్లను తీసుకెళ్లి ఎక్స్ చేంజ్ చేసుకోవాలి. 64 జీబీ కలిగిన ఐఫోన్ 11 ఉంటే మరో రూ.16వేలు, 128 జీబీ కలిగిన ఐఫోన్ 11 ఉంటే రూ.18,420 రాయితీ ఇస్తారు. ఒకవేళ 64 జీబీ కలిగిన ఐఫోన్ 12ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ.21,540 రాయితీ లభిస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 11ను ఎక్స్ చేంజ్ చేసుకుంటే.. రూ.48000 నుంచి రూ.49,900 రేంజ్ లోనే సరికొత్త ఐఫోన్13 మీ చేతికొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని క్రోమా స్టోర్ కు బయలుదేరండి!!

  Last Updated: 22 May 2022, 12:47 AM IST