Site icon HashtagU Telugu

Instagram Feature : కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌‌‌‌కు కొత్త లుక్

Instagram Feature

Instagram Feature

Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ను బెటర్ చేసేందుకు కొత్తకొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. ఈక్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వాడుకునేందుకు వీలుగా ‘యాడ్ యువర్స్ టెంప్లేట్స్’(Add Yours templates) అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌కు అనుగుణమైన టెంప్లేట్స్‌ను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫీచర్ దోహదం చేస్తుంది. మనం ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ప్రిపేర్ చేసే క్రమంలో.. ఫొటోలు, జిఫ్‌లను జోడించే సెక్షన్‌లోనే  ‘యాడ్ యువర్స్ టెంప్లేట్స్’ అనే ఫీచర్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీ పోస్టుకు అనుగుణమైన అభిరుచిని ప్రతిబింబించే టెంప్లేట్‌ను సెలెక్ట్ (Instagram Feature) చేసి వాడుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఈవిధంగా ఎంపిక చేసే టెంప్లేట్స్‌‌కు మీదైనా స్టైల్‌లో సొంతంగా కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేయొచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌‌కు అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీ ఇన్‌స్టా యాప్‌లో అది కనిపించకుంటే.. వెంటనే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ తొలిసారిగా ‘యాడ్ యువర్స్  స్టిక్కర్‌’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘యాడ్ యువర్స్ టెంప్లేట్స్’ ఫీచర్ దానికి విస్తరణే అని అంటున్నారు.