సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు రోజుకో కొత్త ఫీచర్(New Feature)తో వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా, మెటా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్(Instagram , Whatsapp)లలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇకపై రీల్స్ (Reels)వీడియోలను వేగంగా ఫార్వర్డ్ చేయగలిగే సౌలభ్యాన్ని పొందనున్నారు. కొత్త ఫీచర్ ద్వారా, వీడియో స్క్రీన్ కుడి లేదా ఎడమ భాగంలో లాంగ్ ప్రెస్ చేస్తే 2X స్పీడ్(Double Speed Playback)లో ఫార్వర్డ్ అవుతుంది. అలాగే, వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు.
TDP 43rd Foundation Day : రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీనే – లోకేష్
ఇక వాట్సాప్ యూజర్ల కోసం మెటా మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ స్టేటస్‌కు పాటలను జోడించుకునే వీలుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్ తరహాలోనే, తమ స్టేటస్‌కు సంబంధిత ఫొటో, టెక్ట్స్, వీడియోలతో పాటుగా మ్యూజిక్‌ను కూడా యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా ఈ ఫీచర్ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పనిచేస్తుంది. అంటే, వినియోగదారుల స్టేటస్‌లో మ్యూజిక్‌ను చూసే అధికారం కేవలం వారి కాంటాక్ట్‌లకే పరిమితం అవుతుంది.
Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?
వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయాలంటే, మొదటగా యూజర్లు “అప్‌డేట్స్” విభాగంలోకి వెళ్లి కొత్త స్టేటస్‌ను యాడ్ చేయాలి. తర్వాత మ్యూజిక్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసి, మెటా లైబ్రరీలో అందుబాటులో ఉన్న లైసెన్స్డ్ పాటలను ఎంపిక చేసుకోవచ్చు. ఫొటో స్టేటస్‌లలో పాట 15 సెకండ్లు ప్లే అవుతుండగా, వీడియో స్టేటస్‌లలో 60 సెకండ్ల పాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. కొత్త ఫీచర్లతో మెటా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తోంది.