Infinix Smart 8 HD: కేవలం రూ.6 వేలకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తె

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 08:57 PM IST

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఆ సరి కొత్త స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇన్‌ఫినిక్స్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ 7 హెచ్‌డీకి కొనసాగింపుగా స్మార్ట్‌ 8 హెచ్‌డీ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ సేల్‌ డిసెంబర్‌ 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇవి ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇందులో పంచ్‌ హోల్‌ కెమెరాను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా కోర్‌ టీ 606 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు.

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్‌ సిమ్‌ కెపాసిటీని అందించారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అందించారు. డ్యూయల్‌ 4జీ వోల్ట్‌, వైఫై, బ్లూటూత్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్ లను కూడా అందించారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 6,299గా ఉండగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 5,669కే సొంతం చేసుకోవచ్చు.