Infinix Hot 20 5G: అతి తక్కువ ధరకే ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే?

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా 5జీ సేవలు మరింత విస్తరిస్తున్నాయి. అయితే 5జీ సేవలు పెరుగుతున్న కొద్దీ మొబైల్ తయారీ సంస్థలు 5జీ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ పేరుతో బడ్జెట్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన తెలిసిందే. సరికొత్త లుక్కులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఇందులో 120Hz హైపర్-విజన్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే తో లభించనుంది. అలాగే మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ ద్వారా ఈ ఫోన్‌ రన్‌ అవుతుంది. ఇక ఈ ఫోన్‌ వేడెక్కకుండా ఇందులో బయోనిక్ బ్రీతింగ్ కూలింగ్ ని కూడా అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ తో మనకు లభించనుంది. అలాగే ఇందులో వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ ద్వారా మరో 3జీబీ వరకు పెంచుకోవచ్చు. కగా ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే..

ఇందులో 18 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ నెట్‌వర్క్ 12 బ్యాండ్‌ల వరకు పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 11,999 గా ఉంది. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.