Infinix: మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసిన ఇన్ ఫినిక్స్ హాట్ సీరీస్?

ఇన్ ఫినిక్స్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 04:01 PM IST

ఇన్ ఫినిక్స్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచిల మేరకు అందుకు అనుగుణంగా సరికొత్త ఫీచర్ లు, తక్కువ ధరలకె అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది ఇన్ ఫినిక్స్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది ఇన్ ఫినిక్స్. ఇన్ ఫినిక్స్ హాట్ సిరీస్ లో భారీ బ్యాటరీ తో పాటు మీడియా టెక్ ప్రాసెసర్, పంచ్ హోల్ సెటప్ తో ఇన్ ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

కాగా తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మనకు నాలుగు కలర్ లలో లభించనుంది. అందులో రెసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ రంగులు లభ్యం కానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర,మరికొన్ని ఫీచర్ల గురించి. ఇక ఈ ఇన్ ఫినిక్స్ హాట్ 10 ప్లే స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. 6.82 అంగులాల ips LCD డిస్ ప్లే, 90 hz రిఫ్రెష్ రేట్.

మీడియా టిక్ హీలియో జీ 37 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో లభించనుంది. కెమెరాల విషయానికొస్తే..8 ఎంపీ సెల్ఫీ కెమెరా, అలాగే 13 ఎంపీ రియర్ కెమెరా. ఈ విధంగా 6,000 mAh బ్యాటరీ,18 w చార్జింగ్ తో ఈ స్మార్ట్ ఫోన్ మనకు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర, మరిన్ని ప్రత్యేకతల గురించి ఇన్ ఫినిక్స్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే ఉంటుంది అని సమాచారం.