Infinix 43Y1 Smart TV: ఇన్ఫినిక్స్ నుంచి నయా స్మార్ట్ టీవీ విడుదల… నేడే లాంచ్!

ఇన్ఫినిక్స్ సంస్థ కేవలం స్మార్ట్ ఫోన్స్ విభాగంలో మాత్రమే కాకుండా మిగిలిన ప్రోడక్టుల విభాగంలో కూడా మార్కెట్ ను

  • Written By:
  • Updated On - October 11, 2022 / 05:34 PM IST

ఇన్ఫినిక్స్ సంస్థ కేవలం స్మార్ట్ ఫోన్స్ విభాగంలో మాత్రమే కాకుండా మిగిలిన ప్రోడక్టుల విభాగంలో కూడా మార్కెట్ ను క్రమక్రమంగా విస్తరించుకుంటోంది. ఇక ఈ నేపథ్యంలోనే కొత్తగా మార్కెట్లోకి వై1 సిరీస్ లో మరక స్మార్ట్ టీవీని తీసుకురానుంది. ఇన్ఫినిక్స్ 43 వై1 స్మార్ట్ టీవీ ని నేడు అనగా అక్టోబర్ 11 వ తేదీన లాంచ్ చేశారు. కాగా ఇదే విషయాన్ని హాంకాంగ్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కొన్ని స్పెసిఫికేషన్స్ లను కూడా విడుదల చేసింది.

అలాగే ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఇన్ఫినిక్స్ 43వై1 స్మార్ట్ టీవీ 43 ఇంచుల డిస్‌ప్లే తో రానుంది. 300 నిట్స్ పీక్‌ బ్రైట్‌ నెస్ ఉంటుంది. అలాగే డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 20 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ టీవీలో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 లాంటి పాపులర్ ఓటీటీ యాప్స్ అన్నింటికీ ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇన్ఫినిక్స్ 43వై1 రన్ అవుతుందట.

ఇక ఇందులో యాప్స్, గేమ్స్‌ కావాలి అనుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వస్తే… 512జీబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్మార్ట్ టీవీ ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్ఫినిక్స్ సంస్థ 43వై1 స్మార్ట్ టీవీ తో పాటుగా, ఎక్స్ 2 సిరీస్ లో ఇన్ఫినిక్స్ ఎక్స్ 2 ప్లస్ ల్యాప్టాప్ ను కూడా అక్టోబర్ 12న లాంచ్ చేయనుంది.