Site icon HashtagU Telugu

Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది

Mivi Ai Hyderabad Startup Human Like Artificial Intelligence

Mivi AI : కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) విభాగంలో హైదరాబాద్ స్టార్టప్ ‘మివి’ సత్తా చాటుతోంది. ఏఐ టెక్నాలజీని మరో లెవల్‌కు తీసుకెళ్లే దిశగా మివి కీలక ముందడుగు వేసింది. అచ్చం ఒక మనిషిలా ఆలోచించి సంభాషించగలిగే  సరికొత్త ఏఐని మివి రెడీ చేసింది. దీనికే ‘ఏఐ మివి’ అని పేరు పెట్టారు. ఆధునాతన లాంగ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)తో దీన్ని ఆవిష్కరించారు.  మివి ఏఐ మనిషి భావోద్వేగాల్ని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లు సమాధానాలు ఇస్తుంది.  వివిధ భాషలకు చెందిన ఎన్నో రకాల యాసలకు అనుగుణంగా ఈ టూల్ పనిచేస్తుంది.  ఇందులో ప్రత్యేకంగా ‘హాయ్ మివి’ అనే వేక్ వర్డ్‌ను రూపొందించారు. మివి ఏఐ తయారీ కోసం దాదాపు 100 మంది ఇంజినీర్లు పనిచేశారట. ఇందుకోసం దాదాపు రూ.86 కోట్లు ఖర్చయిందట. రానున్న రోజుల్లో మివి ఏఐ  టెక్నాలజీని స్మార్ట్ హోం పరికరాలు, వినియోగదారుల సేవా కేంద్రాలు, ఏఐ ఉత్పత్తుల్లో జోడించనున్నారు.

Also Read :Abid Hasan Safrani : భారతావనికి ‘జైహింద్’ ఇచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ

మివి ఏఐ ఇయర్ బడ్స్.. ఫీచర్స్ ఇవీ.. 

Also Read :Warangal Textile Park: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో 25వేల జాబ్స్.. అప్లై చేసుకోండి