No Set Top Box for TV’s: ఫ్యూచర్లో టివి కి సెట్‌ టాప్‌ బాక్స్‌ అవసరం లేదా?

ముందు ముందు టీవీల్లోనే (TV) ట్యూనర్స్‌ వచ్చేస్తున్నాయి... జనం సెట్‌ టాప్‌ బాక్స్‌ లకి గుడ్ బై చెప్పేయచ్చు -

ముందు ముందు టీవీల్లోనే ట్యూనర్స్‌ వచ్చేస్తున్నాయి… జనం సెట్‌ టాప్‌ బాక్స్‌ (Set Top Box) లకి గుడ్ బై చెప్పేయచ్చు – అన్నంత స్థాయిలో ఇప్పుడు వార్తలు హల్ చల్ .. ఈ దిశలో కేంద్రం ప్రేక్షకులకు భరోసా ఇస్తోందంటూ చెబుతున్నారు. టీవీలు తయారుచేసే కంపెనీలన్నీ – ఇకపైన తమ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్స్ (Inbuilt satellite tuner) ని అమర్చి తీరాలనీ… సమాచార మంత్రిత్వ శాఖవాళ్లు ఆ విధంగా ఆదేశాలు ఇస్తోందనీ.. అదే జరిగితే… టీవీ పక్కన సెట్‌ టాప్ బాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందనీ చర్చలు నడుస్తున్నాయి.

నిజమే. టీవీ కొనగానే దాంతోపాటు సెట్‌ టాప్‌ బాక్స్ (Set Top Box) కూడా తీసుకోవడం ఈ కాలంలో తప్పనిసరి అయిపోయింది. అయితే మరి – కేంద్రంవారి కొత్త నిర్ణయంతో సెట్‌ టాప్ బాక్స్ లకి గుడ్ బై చెప్పేసే కాలం నిజంగానే వచ్చేసిందా? వేచి చూడాల్సిందే.

Also Read:  Kohinoor: కోహినూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌..!