Huawei Mate 60 Pro: ఆకట్టుకుంటున్న మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హువావే ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్ప

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 07:30 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హువావే ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా స్మార్ట్ ఫోన్ హువావే మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. హువావే మేట్‌ 60 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌ను అందించారు.

తర్వలోనే ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.82 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌, 300 హెర్ట్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. హువావే మేట్‌ 60 ప్రో 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర మన కరెన్సీలో రూ. 79,400 వరకు ఉండవచ్చని అంచనా. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో శాటిలైట్ కాలింగ్ అనే అధునాతన ఫీచర్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ హార్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్‌ 4.0 వెర్షన్‌తో పని చేస్తుంది. అలాగే ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్యూలర్‌ కనెక్టివిటీ లేకుండానే శాటిలైట్‌ కాలింగ్‌తో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. 88 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.