Google Contacts : గూగుల్ కాంటాక్ట్స్ యాప్ (Google Contacts App)లో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ద్వారా మీరు జీ మెయిల్, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లలో ఉన్నవారి ప్రస్తుత లొకేషన్‌ను వారి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేయొచ్చు.ఇంతకు ముందు ఎవరైతే తమ లొకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్ చేశారో.. వారి కరెంట్ లొకేషన్‌ను కూడా ట్రాక్ చేయగలుగుతారు. ఇందుకోసం ముందుగా మీరు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ చేసి.. ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్‌ను ట్యాప్ చేయాలి. ఆ వెంటనే మీకు యూజర్ ఫొటో, కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. అక్కడే ‘గూగుల్ మ్యాప్స్ లొకేషన్ షేరింగ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్ ఉన్న లొకేషన్ మీకు కనిపిస్తుంది. మనం ఆ వ్యక్తి ఉన్న లొకేషన్‌కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్స్ అతడు ఉన్న డైరెక్షన్‌ను(Google Contacts) కూడా చూపిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
గూగుల్ కాంటాక్ట్స్ యాప్ 4.22.37.586680692 వర్షన్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీన్ని వాడేందుకు తొలుత ఆండ్రాయిడ్ ఫోన్లోని Settings ఓపెన్ చేయండి. Apps సెక్షన్‌లోని Google Contactsను సెలెక్ట్ చేసి.. అందులో ‘యాప్ ఇన్ఫో’ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 4.22.37.586680692 వర్షన్ ఉండాలి. ఒకవేళ లేకుంటే మీ యాప్ అప్‌డేట్ కానట్టు. యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే.. మీకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒక వేళ యాప్ అప్‌డేట్ చేసినా కొత్త వర్షన్ రాకపోతే వదిలేయండి. త్వరలోనే అది మీకు అందుబాటులోకి వస్తుంది.
Also Read: Kidney Theft – Hyderabad : రోగికి తెలియకుండా కిడ్నీ కాజేసిన డాక్టర్లు