Site icon HashtagU Telugu

Toggle: యూట్యూబ్ లో 18+ కంటెంట్ ని ఎలా నిరోధించాలి

Toggle

Whatsapp Image 2023 04 30 At 2.37.51 Pm

Toggle: యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. కోట్లాది మంది వినియోగదారుల కోసం ఈ సంస్థ అనేక కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ నిత్యం తమ కస్టమర్స్ ని ఎంగేజ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా వినియోగదారుల కోసం కంపెనీ నియంత్రిత మోడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో 18 ప్లస్ కంటెంట్ ని నిరోధించవచ్చు.

నిజానికి యూట్యూబ్ (YouTube)ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా సార్లు 18 ప్లస్ కంటెంట్ ఎదురవుతుంది. అటువంటి పరిస్థితిలో 18+ కంటెంట్‌ని ఆకస్మికంగా ప్లే చేయడం అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ సందర్భంలో యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చిన మోడ్ ఫీచర్ సహాయంతో 18+ కంటెంట్ ని నిరోధించవచ్చు.

యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చిన నిరోధిత మోడ్‌ని ఎలా ఆన్ చేయాలి

ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్‌ని ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కుడివైపు మూడు బటన్స్ మీద క్లిక్ చేయాలి
ఇక్కడ సెట్టింగ్స్ ని ఎంచుకోవాలి.
ఇక్కడ మీరు జనరల్ అనే ఆప్షన్‌ మీద క్లిక్ చేయాలి
ఇక్కడ యూట్యూబ్ తీసుకొచ్చిన మోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది
తర్వాత మీరు టోగుల్ (Toggle)ఆప్షన్ ఆన్ చేయబడాలి.

Read More: Jagananne Maa Bhavishyathu: 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో వైసీపీ ప్రభంజనం