Site icon HashtagU Telugu

Battery Health : మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ తెలుసుకోవాలా.. ఇలా చేయండి

Battery Health

Battery Health

Battery Health : మన ఫోన్​లోని అత్యంత ముఖ్యమైన పరికరం బ్యాటరీ. ఇది కండీషన్‌లో ఉండేలా మనం చూసుకోవాలి. ఈక్రమంలో ఎప్పటికప్పుడు బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకుంటూ ఉండాలి. బ్యాటరీ హెల్త్  స్టేటస్ ఆధారంగా..  దాని లైఫ్‌ను పెంచుకునే టిప్స్‌ను మనం పాటించాలి. అదెలాగో  ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఫోన్‌తో మనం గడిపే టైంలో అసలు భారమంతా బ్యాటరీపైనే పడుతుంటుంది. బ్యాటరీ పనితీరు సరిగ్గా ఉంటేనే.. ఫోన్ కూడా బాగా పనిచేస్తుంది. అందుకే బ్యాటరీని మనం నిర్లక్ష్యం చేయకూడదు.  బ్యాటరీ లైఫ్ స్థితిగతుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఒకవేళ బ్యాటరీలో ఏమైనా టెక్నికల్ లోపాలను గుర్తిస్తే .. వాటిని సరి చేయించుకోవాలి. అలా చేస్తేనే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్(Battery Health) పెరుగుతుంది. ఫలితంగా మీ డివైజ్ లైఫ్ టైం కూడా పెరిగిపోతుంది.

Also Read : Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ

కొన్ని ఫోన్లలో బ్యాటరీ హెల్త్‌ వివరాలను చూపించే ఫీచర్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. మచ్చుకు పరిశీలిస్తే.. శాంసంగ్ ఫోన్​లో బ్యాటరీ హెల్త్‌తో పాటు దాని కెపాసిటీ వివరాలను కూడా ఎప్పటికప్పుడు యూజర్లు చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ స్టేటస్​‌లో ఒకవేళ రెడ్ కలర్‌ను చూపిస్తే.. దాని జీవిత కాలం చివరి దశలోకి వచ్చిందని అర్థం. ఇక మీరు కొత్త బ్యాటరీని తీసుకునేందుకు రెడీ అయిపోవాలి. ఒకవేళ స్మార్ట్ ఫోనులో ఇలాంటి ఆప్షన్ లేకపోతే.. బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్​లను మనం వాడొచ్చు. ఆక్యుబ్యాటరీ, CPU-Z లాంటి అనేక ఉచిత యాప్​లు గూగుల్ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను మనకు అందిస్తాయి. ఈ యాప్‌లు ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ డిశ్చార్జ్ రేటు వంటి యావత్ సమాచారాన్ని చూపిస్తాయి.

Also Read :90 Died : పడవ మునిగి 90 మంది జల సమాధి

మనం ఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లి.. బ్యాటరీ సెక్షన్‌పై క్లిక్ చేస్తే ప్రత్యేకమైన మెనూ వస్తుంది. అందులో పనితీరుకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. మన ఫోనులో ఉన్న ఏ యాప్ మన బ్యాటరీని ఎంత వాడుకుంటుంది అనే చిట్టా కూడా మనకు దొరుకుతుంది. బ్యాటరీని ఎక్కువగా తినేస్తున్న యాప్స్ వాడకాన్ని తగ్గించేలా మనం చర్యలు తీసుకునేందుకు ఈ రిపోర్టు పనికొస్తుంది. ఏయే యాప్స్​ ఎంత మేరకు బ్యాటరీ యూసేజ్ చేయొచ్చు అనేది మనం డిసైడ్ చేసే ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే మన వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ యుసేజ్​ను అప్టిమైజ్ చేస్తున్నామన్న మాట. కొన్ని అడ్వాన్స్‌డ్ ఫోన్లలో మన బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉందనే విషయాన్ని తెలిపే ఫీచర్స్ కూడా ఉంటాయి.

డయాగ్నోస్టిక్​ మెనూ.. ##4636## నంబర్‌

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న యూజర్లు ఆండ్రాయిడ్ డయాగ్నోస్టిక్​ మెనూను చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు వాడుతున్న ఫోన్ వివరాలు, వైర్‌లెస్ నెట్‌వర్క్ వినియోగంతో ముడిపడిన ఇన్ఫో, బ్యాటరీ పనితీరు వివరాలు తెలిసిపోతాయి.  మన ఫోన్‌కు సంబంధించిన డయాగ్నోస్టిక్​ మెనూను ఓపెన్ చేయడానికి ##4636## నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ ఫోన్​ బ్యాటరీ హెల్త్ వివరాలు తెలుసుకోవచ్చు.