Cool House Tech : ఎండలు మండినా, వడగాలులు వీచినా ఇల్లు కూల్‌గా ఉండాలా? ఈ రెండింటినీ తట్టుకొని ఇంటిని కూల్‌గా ఉంచే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ మన ముందుకు త్వరలోనే రాబోతోంది. అది నిర్మాణ రంగంలో పెద్ద విప్లవాన్ని క్రియేట్ చేయబోతోంది. ఇంతకీ అదేమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే తప్పకుండా ఈ కథనం చదవండి.
Also Read :Gig Workers : గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్లకు పెన్షన్ స్కీం.. ప్రయోజనం ఇలా..
అధ్యయనం ఇలా..
సమ్మర్ సీజన్‌లోనూ.. వడగాలులు వీచే వేళల్లోనూ ఇంటిని కూల్‌గా ఉంచే ఇటుకలు రెడీ అవుతున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘స్ట్రక్చర్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్’(SERC) తయారు చేస్తోంది. వాటిని ‘ఈపీఎస్ కన్‌స్ట్రక్షన్ బ్లాక్’(EPS construction blocks) అని పిలుస్తారు. ఈ ఇటుకలు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. వీటితో శాంపిల్‌గా కొన్ని ఇళ్లను నిర్మించి, వివిధ సీజన్లలో ఆయా ఇళ్లలోని టెంపరేచర్స్‌లో వస్తున్న మార్పుల వివరాలను స్టడీ చేస్తున్నారు. వివిధ సీజన్లలో బయటి వాతావరణంలో ఎంత టెంపరేచర్ ఉంది ? ఈపీఎస్ బ్లాక్‌లతో నిర్మించిన ఇంటి లోపల ఎంత టెంపరేచర్ ఉంది ? అనేది నమోదు చేస్తూ అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమ్మర్ టైంలో బయట ఉండే టెంపరేచర్ కంటే ఈపీఎస్ బ్లాక్‌లతో నిర్మించిన ఇంట్లో ఉండే టెంపరేచర్ 9 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా ఉందని వెల్లడైంది.
ఈపీఎస్ అంటే ఏమిటి ?
‘ఈపీఎస్’ అంటే ‘ఎక్స్‌ప్యాన్డెడ్ పాలీస్టైరీన్’. ఇదొక రకం ప్లాస్టిక్. ఈపీఎస్ బ్లాక్‌లు(Cool House Tech) తేలిగ్గా ఉంటాయి. రెండు బ్రెడ్ ముక్కల ఆకారంలో సిమెంటు దిమ్మెలను తయారు చేసి.. వాటి మధ్యలో ఆమ్లెట్ తరహాలో థర్మకోల్‌ను ఉంచడం ద్వారా ఈపీఎస్ బ్లాక్ తయారవుతుంది. ఈపీఎస్ బ్లాక్ లోపల నలుమూలాల స్టీల్ బార్లు ఉంటాయి. ఇవి దానికి నిలకడ శక్తిని అందిస్తాయి. ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు కావడం వల్ల ఈపీఎస్ బ్లాక్‌లలోకి థర్మల్ ఇన్సులేషన్ ధారాళంగా జరుగుతుంది. దీనివల్ల అవి వేడెక్కడానికి, చల్లబడటానికి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. అందుకే వీటితో నిర్మించే ఇల్లు మండుటెండల్లోనూ కూల్‌గా ఉంటుంది. వేడెక్కదు.