Site icon HashtagU Telugu

Honor Magic 6 Pro: త్వరలోనే మార్కెట్ లోకి హానర్ స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

Mixcollage 04 Jan 2024 03 05 Pm 7504

Mixcollage 04 Jan 2024 03 05 Pm 7504

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయబోతోంది. హానర్ విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్స్‌ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ సిరీస్‌ మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా అధికారికంగా ప్రకటించింది. కంపెనీ జనవరి 10 నుంచి జనవరి 11 వరకు చైనాలో జరిగే రెండు రోజుల ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఈవెంట్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 పోర్షే డిజైన్, హానర్ మ్యాజిక్ 6 ప్రో అనే మూడు మోడల్స్‌ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే చైనాలో ప్రీబుకింగ్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లు విడుదలకు ముందే కంపెనీ డిజిటల్ చాటింగ్ స్టేషన్ Weiboలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. కాగా ఈ ఫోన్ మనకు గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇకపోతే ఈ బ్యాక్‌ ప్యానెల్‌ విషయానికొస్తే.. ఇంతముందు ఎప్పుడు చూడని ఫినిషింగ్‌తో రాబోతోంది. దీంతో పాటు త్రిభుజాకార రూపంలో త్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు LED ఫ్లాష్‌ కూడా అందుబాటులో ఉంది. కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇక ముందు భాగంలో రెండు సెల్ఫీకెమెరాలకు పిల్ ఆకారపు కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇక Honor Magic 6 Pro స్మార్ట్ ఫోన్‌ విషయానికొస్తే.. ఇంతక ముందు కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో ఎలాగైతే ఫీచర్స్‌తో వెల్లడించిందో అవే స్పెషిఫికేషన్స్‌, ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ టీజర్‌లో కంపెనీ డ్యూయల్-LED ఫ్లాష్, మైక్రోఫోన్, 100x జూమ్‌తో కూడిన కెమెరా వంటి ఫీచర్స్‌ను పేర్కొంది. దీంతో పాలు ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ కోసం MagicOS 8తో రాబోతోంది. 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ ఫోన్‌ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఫ్రెంట్‌ లుక్‌ విషయానికొస్తే.. ఈ మొబైల్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ (ToF) 3D కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది క్విక్‌ ఫేస్ అన్‌లాకింగ్‌ కోసం ఎంతగానో సహాయపడుతుంది. ఈ సిరీస్‌ ధర విషయానికొస్తే..రూ.111,990 తో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.