Site icon HashtagU Telugu

Samsung Users: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. కారణమిదే..?

Samsung Users

Samsung Galaxy A34

Samsung Users: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు (Samsung Users) భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అదనపు భద్రత కోసం తమ ఫోన్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) భద్రతా సలహాలో లక్షలాది మంది శాంసంగ్ గాలక్సీ వినియోగదారుల ఫోన్‌లలోని లోపాలను ప్రస్తావించారు.

డిసెంబర్ 13న జారీ చేసిన భద్రతా హెచ్చరికలో ఇది పెను ముప్పుగా అభివర్ణించారు. సామ్‌సంగ్ వినియోగదారులు తమ ఫోన్‌ల ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఫర్మ్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లతో పాటు పాత ఫోన్‌లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్‌ నేరస్తులు లక్షల మంది శాంసంగ్‌ ఫోన్‌లలోని వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

Also Read: Governor Tamilisai Speech in Assembly : ఇది ప్రజా ప్రభుత్వం..నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు – గవర్నర్

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా ఈ హెచ్చరిక Samsung స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది. సైబర్‌ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్‌ సంగ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 11,12,13,14లోని ఆపరేటింగ్‌ సిస్టంను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఫోన్‌ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా చేసిన సైబర్‌ నేరస్తులు ఫోన్‌లలోని డివైజ్‌ పిన్‌ను, ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను హ్యాక్ చేసి చదవగలరు. సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేయగలరు. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.