Google AI Images : గూగుల్ మరో కొత్త ఏఐ ఫీచర్ ను తీసుకొచ్చింది. దాని పేరే.. ‘సెర్చ్ జనరేటివ్ ఎక్స్ పీరియన్స్’ (ఎస్జీఈ). SGEలో ఇమేజ్ జనరేషన్ టూల్ ను ప్రస్తుతానికి అమెరికాలో విడుదల చేసింది. క్రమంగా అన్ని ప్రపంచదేశాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఫీచర్ ఎలా వాడాలి ?
- ఈ ఫీచర్ ను వాడుకునేందుకు మనం సింపుల్ గా గూగుల్ సెర్చ్ బాక్స్ లోకి వెళ్లి.. ఏఐలో మనం డ్రా చేయదల్చుకున్న ఫొటో వివరాలను టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి.
- ఆ వెంటనే మన ముందు నాలుగు ఏఐ ఫొటోలు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో మనకు నచ్చింది ఓపెన్ చేసుకొని .. దిగువన ఉండే ‘ఎడిట్’ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
- అనంతరం ఏఐ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ఇమేజ్ లో మనకు నచ్చిన రీతిలో ఎఫెక్ట్ లను అప్లై చేయొచ్చు. సైజు, రంగు, హావభావాలను దానికి జోడించేలా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
- అయితే ఈ టూల్ ను వాడుకొని సమాజ వ్యతిరేక ఫోటోలను, ఇతరులను కించపరిచే ఫొటోలను క్రియేట్ చేయకుండా ఎలా నిలువరించాలి ? అనే దానిపై గూగుల్ నిబంధనలను రెడీ చేస్తోందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా గూగుల్ ఒక ఒక బ్లాగ్ పోస్టును పెట్టింది. ‘‘మేం చాలా కాలంగా AIలో కొత్త కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నాం. ఈక్రమంలోనే మరో పురోగతి సాధించాం. ‘సెర్చ్ జనరేటివ్ ఎక్స్ పీరియన్స్’ ఫీచర్ రెడీ అయింది. దీని ద్వారా టెక్స్ట్ నుంచి ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. మెసేజ్ లకు రిప్లైలు కూడా క్రియేట్ చేయొచ్చు’’ అని ఆ పోస్టులో గూగుల్ వెల్లడించింది. ఇంతకుముందు ఇదే తరహా ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో ‘డాల్-ఇ-3’ పేరుతో పరిచయం చేసింది. ‘డాల్-ఇ-3’ ఫీచర్ ను ChatGPT తయారీ సంస్థ OpenAI ద్వారా మైక్రోసాఫ్ట్ డెవలప్ చేయించింది. ఇప్పుడు గూగుల్ రిలీజ్ చేసిన ‘సెర్చ్ జనరేటివ్ ఎక్స్ పీరియన్స్’ (ఎస్జీఈ) ఫీచర్ .. దాని కంటే మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. నెటిజన్లు ఎస్జీఈ ఫీచర్ ద్వారా డ్రాఫ్ట్‌లను రాయొచ్చు. ఆ డ్రాఫ్ట్ టోన్ ను కూడా (Google AI Images) మార్చొచ్చు.