Site icon HashtagU Telugu

Gmail Smart Reply : జీమెయిల్​లో స్మార్ట్ రిప్లై ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

Gmail Smart Reply

Gmail Smart Reply : జీమెయిల్‌‌ను నిత్యం మనలో ఎంతోమంది వాడుతుంటారు. ప్రొఫెషనల్ మెయిల్ ప్లాట్‌ఫామ్‌గా జీమెయిల్‌కు మంచి పేరుంది. అందుకే జీమెయిల్‌లోనూ గూగుల్ అత్యాధునిక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈక్రమంలో ఓ కొత్త ఫీచర్ వచ్చింది. దాని గురించి మనం తెలుసుకుందాం. జీమెయిల్‌లో మనం పంపే రిప్లైలకు రెక్కలు తొడిగేలా, వాటిని సరళీకరించేలా ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. వివరాలివీ..

Also Read :Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే ?

జీమెయిల్‌లో గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ పేరు.. జీమెయిల్ స్మార్ట్ రిప్లై. దీని ద్వారా మనం సందర్భోచితంగా ఎవరికైనా రిప్లైస్ ఇవ్వొచ్చు. అదెలా అంటే.. మనం రిప్లైలు ఇచ్చే క్రమంలో జీమెయిల్ స్మార్ట్ రిప్లై ఫీచర్ కొన్ని సూచనలు చేస్తుంది. ఏఐ టెక్నాలజీని వాడుకొని ఈ సూచనలు జనరేట్ అవుతాయి. మనకు వచ్చిన ఈమెయిల్‌లోని టెక్ట్స్, వర్డ్స్ ఆధారంగా  ఈ సూచనలను ఏఐ టెక్నాలజీ జనరేట్ చేస్తుంది. ఈ సజెషన్లను(Gmail Smart Reply) వాడుకొని మనం రిప్లైలను ఈజీగా పంపేయొచ్చు. మనకు నచ్చని సజెషన్లను వదిలేసి.. నచ్చిన వాటినే రిప్లైగా పంపొచ్చు. ఈ రిప్లైలు అర్థవంతంగా, స్మార్ట్‌గా ఉంటాయి.

Also Read :Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక

మనకు వచ్చిన సజెషన్లను ఎంపిక చేసుకొని.. వాటిని ఎడిట్ చేసి అవసరాలకు అనుగుణంగా మార్చుకొని రిప్లైను పంపొచ్చు. వాస్తవానికి 2017 సంవత్సరంలోనే ఈ ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఫీచర్‌కు ఏఐ టెక్నాలజీని జోడించింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు సపోర్ట్ చేస్తూ ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రస్తుతానికి గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియంతో పాటు కొంతమంది యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది.విడతల వారీగా తమ యూజర్లు అందరికీ ఈ ఫీచర్‌ను అందిస్తామని గూగుల్ అంటోంది.

Also Read :Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ