WhatsApp Video Calls : మీరు వాట్సాప్ వాడుతున్నారా ? గూగుల్ మెసేజెస్ వాడుతున్నారా ? అయితే ఈ న్యూ అప్‌డేట్ గురించి తప్పక తెలుసుకోండి. మీకు ఉపయోగపడే ఒక కొత్త ఫీచర్ రాబోతోంది.
Also Read :Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !
ఛాట్ స్క్రీన్‌పైనే..
గూగుల్ మెసేజెస్ కూడా మెసేజింగ్ యాపే. దీన్ని కూడా నిత్యం చాలామంది వినియోగిస్తుంటారు. దీనిలో ఇప్పటికే పలు మంచి ఫీచర్లు ఉన్నాయి. త్వరలోనే మనం గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. ఇందుకోసం గూగుల్ మెసేజెస్‌లో ఒక ఫీచర్‌ను అదనంగా యాడ్ చేస్తారు. ఈ యాప్‌లో ఛాట్ చేస్తున్న టైంలో స్క్రీన్‌పై ఎగువ భాగంలో కుడివైపున వాట్సాప్ వీడియో కాల్ ఆప్షన్‌ను డిస్‌ప్లే చేస్తారు. ఆ ఐకాన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. గూగుల్ మెసేజెస్ యూజర్లు, వాట్సాప్‌లోకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచే నేరుగా వీడియో కాల్ చేసేయొచ్చు.
Also Read :Maha Kumbh Padayatra : రివర్స్‌లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర
ఒకవేళ వాట్సాప్ ఖాతా లేకుంటే..
ఒకవేళ గూగుల్ మెసేజెస్ యూజర్‌కు వాట్సాప్(WhatsApp Video Calls) ఖాతా లేకుంటే, ఆ వీడియో కాల్ నేరుగా గూగుల్ మీట్‌కు కనెక్ట్ అవుతుంది. అయితే షరతులు వర్తిస్తాయి. ఈ ఫీచర్‌తో ఒకే వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. గ్రూప్ కాల్స్ చేయలేం. ఒకవేళ గ్రూప్ కాల్స్ చేయాలని భావిస్తే వాట్సాప్‌ను వాడుకోవాలి. తదుపరిగా తామే గ్రూప్ కాల్స్‌ను కూడా ఇందులో యాడ్ చేస్తామని గూగుల్ మెసేజెస్ అంటోంది. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. Your profile పేరిట ఒక కొత్త ఫీచర్‌ను ఇటీవలే గూగుల్ మెసేజెస్ తీసుకొచ్చింది. ప్రొఫైల్‌పై నియంత్రణ అధికారాన్ని యూజర్లకు కల్పించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. గూగుల్, వాట్సాప్‌లు కలిసికట్టుగా ఈ తరహా ఫీచర్లతో ముందుకు సాగుతుండటం అనేది టెక్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. లాంగ్ టర్మ్‌లో కలిసికట్టుగా పనిచేయాలని గూగుల్, వాట్సాప్‌లు యోచిస్తున్నాయా ? అనే సందేహాలకు తావిస్తోంది.
