YouTube Account Hack : సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్ రారాజు. ఈవిషయంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ఎందుకంటే ప్రజలు అంతగా యూట్యూబ్ కంటెంట్‌ను ప్రతిరోజూ గంటల తరబడి చూస్తున్నారు. ప్రతిరోజు ప్రజలు చాలా సమయాన్ని యూట్యూబ్‌లో వెచ్చిస్తున్నారు. అందుకే యూట్యూబ్‌లో మంచి కంటెంట్ క్రియేట్ చేసేవారికి ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ తరుణంలో మంచి ఆదాయం గడిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటిని హ్యాక్ చేసేందుకు తెగబడుతున్నారు. డిమాండ్ ఉన్న యూట్యూబ్ ఛానళ్లను హ్యాక్ చేసి.. వాటిలోని వీడియోలను తస్కరిస్తున్నారు. ఆ అకౌంట్ల ఐడీలు, పాస్ వర్డ్‌లను మార్చేస్తున్నారు. దీనివల్ల కొందరు యూట్యూబ్ క్రియేటర్లు బాగా నష్టపోతున్నారు. తమ అకౌంట్లను రికవర్ చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. అందుకే గూగుల్ ఒక కొత్త ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. దాని ద్వారా చాలా ఈజీగా హ్యాక్‌కు గురైన యూట్యూబ్ ఛానల్‌ను(YouTube Account Hack) రికవర్ చేయొచ్చు.
Also Read :Manda Krishna Madiga : సీఎం రేవంత్‌తో మందకృష్ణ మాదిగ భేటీ.. సీఎం ట్వీట్
హ్యాక్ అయిన యూట్యూబ్ ఖాతాలను రికవర్ చేసుకునేందుకు గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఏఐ టూల్.. గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తుంది. వాటికి సదరు యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ సరైన సమాధానాలు చెప్పాలి. ఆ వెంటనే యూట్యూబ్ ఛానల్ లాగిన్‌ను గూగుల్ ఏఐ టూల్ పునరుద్ధరిస్తుంది. అప్పటికే సదరు హ్యాకర్ యూట్యూబ్ ఛానల్ సమాచారంలో ఏవైనా మార్పులు చేసి ఉంటే, వాటిని డిలీట్ చేసి పూర్వస్థితికి తీసుకొస్తుంది. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయితే గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఏఐ టూల్‌తో ఆ పనిని పూర్తి చేయొచ్చు. యూట్యూబ్ అకౌంటును రక్షించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ టూల్ ఇంగ్లిష్ భాషలో అందుబాటులో ఉంది. అయితే తొలి విడతలో కొందరు ఎంపిక చేసిన యూట్యూబ్ క్రియేటర్లకు ఈ టూల్‌ను అందుబాటులోకి తేనున్నారు. విడతలవారీగా అందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది. ఎవరికైనా ఈ టూల్ కావాలంటే ఎక్స్‌లో @TeamYouTubeను సంప్రదించి సహాయం పొందొచ్చు.