WhatsApp smartwatch : ఇక స్మార్ట్ వాచ్ లోనూ వాట్సాప్

ఇక మన స్మార్ట్ వాచ్ లకు ఒక అద్భుత ఫీచర్ యాడ్  కాబోతోంది. మనం రోజూ వాడే వాట్సాప్ త్వరలోనే స్మార్ట్ వాచ్ (WhatsApp smartwatch)లలోనూ  హల్ చల్ చేయబోతోంది.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 08:46 AM IST

ఇక మన స్మార్ట్ వాచ్ లకు ఒక అద్భుత ఫీచర్ యాడ్  కాబోతోంది. మనం రోజూ వాడే వాట్సాప్ త్వరలోనే స్మార్ట్ వాచ్ (WhatsApp smartwatch)లలోనూ  హల్ చల్ చేయబోతోంది. దాని వల్ల మనం ఫోన్ ను చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే.. జస్ట్   మన మణికట్టు నుంచే వాట్సాప్  మెసేజింగ్ యాక్టివిటీ, కాల్స్ యాక్టివిటీని కంప్లీట్ చేయొచ్చు. WearOS అనేది ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లలో ఆపరేటింగ్ కోసం వాడుతున్న ఆండ్రాయిడ్  సాఫ్ట్ వేర్.  ఆండ్రాయిడ్  ఓనర్ గూగుల్ కంపెనీ అని మనందరికీ తెలుసు.  అది కాలిఫోర్నియాలోని హెడ్ ఆఫీస్ లో   ఏటా google  I/o పేరుతొ  పెద్ద టెక్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటుంది. ఈసారి ఆ కాన్ఫరెన్స్ మే 10న మొదలైంది. ఇందులో గూగుల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.  2021లో తాము రిలీజ్ చేసిన “WearOS3” ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ వాచ్ (WhatsApp smartwatch)లలో త్వరలోనే వాట్సాప్ కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

also read : WhatsApp microphone access :వాట్సాప్ మైక్ చెవులు.. మీ మాటల్ని వింటున్నాయా?

Android 2.23.10.10 వెర్షన్ బీటా యాప్ లో ఇప్పటికే రిలీజ్..   

మరోవైపు వాట్సాప్ ఈ దిశగా కసరత్తును స్పీడప్ చేసింది.  వారం రోజుల కిందటే వాట్సాప్ తన యాప్ యొక్క బీటా వెర్షన్‌ను గూగుల్ స్మార్ట్‌వాచ్ ప్లాట్‌ఫారమ్‌ “WearOS3″కి అనుకూలంగా మార్చింది. ప్రస్తుతానికి  Android 2.23.10.10 వెర్షన్ WhatsApp బీటా యాప్ ను  ఉపయోగిస్తున్న వ్యక్తులు వారి Wear OS3 సపోర్ట్ చేసే స్మార్ట్‌వాచ్‌ (WhatsApp smartwatch) ను లింక్  చేసుకోవచ్చు.  అందులో తమ మెసేజ్ లను చూసుకోవచ్చు. తమ రీసెంట్ చాట్స్ కు వాయిస్ నోట్స్ పంపొచ్చు. వాయిస్ నోట్ లేదా టెక్స్ట్ ఇన్‌పుట్‌తో మెసేజ్ లకు రిప్లై ఇవ్వొచ్చు. అయితే, యూజర్స్  ప్రస్తుతానికి Wear OS యాప్‌లో కొత్త చాట్ ను మాత్రం ప్రారంభించలేరు. దీంతోపాటు ఒక నిర్దిష్ట చాట్ కోసం సెర్చ్ చేయలేరు.

also read : edit messages feature : వాట్సాప్ వెబ్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్

ఔను.. అది నిజమే : మార్క్ జుకర్‌బర్గ్ 

Wear OS3ని సపోర్ట్ చేసే పూర్తి స్థాయి వాట్సాప్  యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాల్‌లు, చాట్స్ చేసుకునే వీలు ఉంటుందని google  I/o కాన్ఫరెన్స్ లో తాజాగా  గూగుల్ వెల్లడించింది. వాట్సాప్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా గూగుల్ చేసిన ఈ  ప్రకటనను ధృవీకరించారు. “మేము ఈ ఏడాది చివర్లో Wear OSలో మొదటి వాట్సాప్  స్మార్ట్‌వాచ్ (WhatsApp smartwatch) యాప్‌ను లాంచ్ చేస్తున్నామని Google I/Oలో ప్రకటించారు. మీరు దాని ద్వారా కొత్త సంభాషణలను ప్రారంభించగలరు. చాట్స్ కు రిప్లై ఇవ్వగలరు. మీ మణికట్టు నుంచే  వాట్సాప్ కాల్స్ తీసుకోగలరు” అని జుకర్‌బర్గ్ చెప్పాడు.